Home Special Looks నదియా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఒకప్పుడు పెద్ద స్టార్.. కొద్దిమందికే తెలిసిన విషయం!
Special Looks

నదియా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఒకప్పుడు పెద్ద స్టార్.. కొద్దిమందికే తెలిసిన విషయం!

Then A Big Star Now A Character Artist

నదియా. ఈ పేరు ఒకప్పుడు చాలామందికి తెలిసిన పేరు ఇది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఆమె 80లలో హీరోయిన్ గా నటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మూవీలో ఒక ముఖ్యపాత్రని పోషించి అందరి దృష్టినీ తిరిగి ఆకర్షించింది. ఇలా ఆకట్టుకోవడం ఇదేమీ ఆమెకి మొదటిసారి కాదు. అసలు ఆమె జర్నీ ఎలా మొదలైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవడం ఎప్పుడో జరిగింది. ‘బజారు రౌడీ’ 1988 లో వచ్చిన సినిమా. ఆ మూవీకి డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. రమేష్ బాబు హీరోగా చేసిన ఈ మూవీకి నదియా హీరోయిన్ గా నటించింది. నిజానికి అప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయి.. ఒక స్టార్ గా ఎదుగుతున్న టైమ్ అది. కోలీవుడ్ లో రజనీకాంత్, ప్రభు, సత్యరాజ్, విజయ్ కాంత్ వంటి అందరూ పెద్ద హీరోలతో నటించింది నదియా. ఐతే, బజారు రౌడీ సినిమా వచ్చిన అదే సంవత్సరం ఆమె పెళ్లి చేసుకోవడం సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేలా చేసింది అనుకోవచ్చు. ఆమె భర్త శిరీష్ బోలె ఒక బిజినెస్ మేన్. ఆయన వ్యాపార నిమిత్తం లండన్ లో ఉంటాడు కాబట్టి ఇక ఈమె కూడా అక్కడికే వెళ్లిపోక తప్పలేదు. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నదియాకి.

నదియా పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ముంబై వచ్చి ఇక్కడ సెటిల్ ఐపోయారు. 2004 వరకు ఆమె గ్లామర్ ఫీల్డ్ కి పూర్తిగా దూరంగా ఉన్నారు. 2004 లో జయం రవి హీరోకి తల్లిగా ఒక తమిళ సినిమాతో తిరిగి తెర మీద కనిపించింది. ప్రభాస్ తల్లిగా మిర్చీలో కనిపించి.. తిరిగి తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తూ ఉండటంతో ఆమె ప్రస్తుతం చెన్నైకి మారిపోయింది. ఐతే, నదియా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాల్ని కూడా బానే తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...