Home Film News Kajal: ఇదెక్క‌డి దారుణం.. పెళ్లై బిడ్డ పుట్టాక కూడా కాజ‌ల్‌ని కమిట్‌మెంట్ అడిగారా..?
Film News

Kajal: ఇదెక్క‌డి దారుణం.. పెళ్లై బిడ్డ పుట్టాక కూడా కాజ‌ల్‌ని కమిట్‌మెంట్ అడిగారా..?

Kajal: క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కాజ‌ల్‌. ఎప్పుడు కూడా అతిగా గ్లామ‌ర్ షో చేయ‌కుండా ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది.  లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన కాజ‌ల్‌కి మ‌గ‌ధీర మంచి హిట్ అందించింది. ఇక అక్క‌డి నుండి దూసుకుపోయింది. స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన ఈ అమ్మ‌డు స్పెష‌ల్ సాంగ్స్ లో కూడా న‌ర్తించి అద‌ర‌గొట్టింది.ఇక కెరీర్ దూసుకుపోతున్న స‌మ‌యంలోనే కాజ‌ల్ త‌న చిన్నానాటి ఫ్రెండ్   గౌతమ్ కిచ్చులు ని వివాహం  చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

బిడ్డ పుట్టాక కూడా కాజ‌ల్ తిరిగి సినిమాలు చేస్తుంది. కాజ‌ల్‌కి సినిమాపై ఉన్న ప్యాష‌న్‌తో ఆయ‌న భ‌ర్త కూడా ఎలాంటి అబ్జెక్ష‌న్స్ చెప్ప‌డం లేదట‌. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ కు డైరెక్టర్స్ నుంచి చేదు అనుభవమే ఎదురైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. కొంద‌రు ద‌ర్శకులు నీకు పెళ్లై, బిడ్డ పుట్టాక హీరోయిన్ గా ఎలా న‌టిస్తావు అని విమ‌ర్శించార‌ట‌. మ‌రి కొంద‌రు మాత్రం కాజ‌ల్‌పై మోజుతో  కమిట్మెంట్ అడిగారట . ఈ విషయం కాస్త‌ ఆలస్యంగా వెలుగులోకి రాగా, ఇప్పుడు ఇది  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ మొదటి నుంచి చాలా ప‌ద్ద‌తిగా ఉంటూ వ‌చ్చింది. అయితే తాను త‌ల్లి అయ్యాక కూడా  ఇలా  కమిట్మెంట్ అడగడం ఆమె జీర్ణించుకోలేకపోయిందట .

అంతేకాదు ఆ సినిమాని రిజెక్ట్ చేసిన కాజ‌ల్ వారు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసింద‌ట‌. కాజ‌ల్ తెగువ‌కి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమెని వేధించిన ద‌ర్శ‌కుడిని బండ‌బూతులు తిడుతున్నారు.మ‌రి కొంద‌రు మాత్రం ఆమెని వేధించిన వ్య‌క్తి ఎవ‌రా అని ఆరాలు తీస్తున్నారు. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రో వైపు బిజినెస్‌లు కూడా చేస్తూ త‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...