Home Film News Siddharth: సిద్ధార్థ్ త‌న మొద‌టి భార్య‌కి ఎందుకు విడాకులు ఇచ్చాడు.. అస‌లు కార‌ణం ఆమేనా?
Film News

Siddharth: సిద్ధార్థ్ త‌న మొద‌టి భార్య‌కి ఎందుకు విడాకులు ఇచ్చాడు.. అస‌లు కార‌ణం ఆమేనా?

Siddharth: ల‌వ‌ర్ బోయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ హీరో సిద్ధార్థ్ త‌న కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. బాయ్స్, బొమ్మ‌రిల్లు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో స్టార్ హీరోగా మారాడు.  మంచి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ త‌ర్వాత ఫ్లాపుల బాట ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో అత‌ని సినీ కెరియ‌ర్ కూడా నాశ‌నం అయింది. ఏదో అడ‌పాద‌డ‌పా సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తున్నా కూడా అవి హిట్ కావ‌డం లేదు. అయితే సిద్ధార్థ్  సినీ కెరియర్ నాశనం కావ‌డానికి కారణం అలాగే తన మొదటి భార్య కి ఆయ‌న‌ విడాకులు ఇవ్వడానికి కారణాలు ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

సిద్ధార్థ్   మేఘన  అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరిని పిల్లల్ని కూడా క‌న్నాడు.  పిల్ల‌ల విష‌యంలో అంత క్లారిటీ లేదు కాని పెళ్లైన  విష‌యం మాత్రం అఫీషియ్ అంటున్నారు. బాలీవుడ్ న‌టి  సోహా అలీ ఖాన్ తో సిద్ధార్థ్ రిలేషన్ పెట్టుకోవడం వల్లే  మేఘ‌న‌..సిద్ధార్థ్‌ల మ‌ధ్య మ‌నస్ప‌ర్ధ‌లు వ‌చ్చి విడిపోయారు. సోహ అలీఖాన్‌తో కూడా ఆయ‌న బంధం ఎక్కువ రోజులు కొన‌సాగ‌లేదు. ఆ త‌ర్వాత స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకుంటారు అనే స‌మ‌యంలో బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇక అప్ప‌టి నుండి సోలోగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు అదితి రావు హైద‌రితో తెగ హంగామా చేస్తున్నారు.

అదితి, సిద్ధార్థ్ మధ్య రిలేషన్ ఉందని.. అందుకు సాక్ష్యంగా ఎప్పుడూ ఏదో ఒక ఫొటో బయటకు వస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల వారిద్ద‌రు  రాజస్థాన్ వెళ్లి హంగామా చేయ‌గా, ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది చూసి వారి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని అంద‌రు ఫిక్స్ అయ్యారు. అయితే  వీరిద్దరు తమ రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడాలని అభిమానులు కోరుతున్నారు. మొత్తానికి సినిమాల విషయాల్లో కాకుండా హీరోయిన్లతో ఎఫైర్స్ విషయంలోనే సిద్ధార్థ్‌ ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ఇక ఆయ‌న  సినిమా కథలు ఎంచుకునే విషయంలో తప్పటడుగులు వేయడంతో ఆయన సినీ కెరియర్ నాశనం అయిందని చెప్పుకోవచ్చు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...