Home Film News Megastar as Director: మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కి ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారా.. ఆ సినిమాలేంటో తెలుసా?
Film News

Megastar as Director: మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కి ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారా.. ఆ సినిమాలేంటో తెలుసా?

Megastar as Director: మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఉన్న‌త స్థానానికి చేరుకున్నారు. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు చిరు. ఆయ‌న న‌టించిన వాల్తేరు వీర‌య్య చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో భోళా శంకర్ చిత్రం చేసాడు. ఆగ‌స్ట్ 11న ఈ మూవీ విడుద‌ల కానుంది. సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అయితే చిరంజీవి గురించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగాను స‌త్తా చాటారు.

సాధార‌ణంగా  హీరో అన్నాక నటన, డాన్స్ కామ‌న్. కాని  చిరు మాత్రం  ఆల్ రౌండ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు, అన్ని విభాగాల్లో రాణించాలని చిరంజీవి ఎంతో కృషి చేశారు. ఆ క్ర‌మంలోనే  చిరంజీవి దర్శకత్వం కూడా వహించారు అనధికారికంగా దర్శకుడిగా చిరంజీవి వ్యవహరించిన సందర్భాలు అనేకం. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అంద‌రికి తెలిసిందే. ఆ సినిమా అప్ప‌ట్లో  ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా   నిలిచింది. డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకి డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. అయితే అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు సినిమాకి కూడా గోపాల్ దర్శకత్వం వహించారు.

రెండు చిత్రాల‌ని ఒకేసారి గోపాల్ సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లారు. ఆయ‌న ఫోక‌స్ మొత్తం  ఎక్కువగా అల్లరి రాముడు సినిమా మీద  పెట్టారు. ఆ క్ర‌మంలో  చిరంజీవి దర్శకుడు బాధ్యతలు తీసుకొని చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కంచారు. ఈ విష‌యం అప్పట్లో  ఓ రేంజ్‌లో మారుమ్రోగి పోయింది. అయితే ఒకే స‌మ‌యంలో తెర‌కెక్కిన ఇంద్ర సినిమా అప్పుడు హిట్ అయితే అల్లరి రాముడు సినిమా మాత్రం ఫ్లాప్ గా మారింది. చిరంజీవికి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ కూడా ఉండ‌గా, ఆయ‌న  తన ప్రతి సినిమాకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పూర్తి ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న  భోళా శంకర్ సినిమాకి కూడా చిరంజీవి  దర్శకత్వం వహించారని తెలుస్తోంది. అనధికారికంగా ఈ మూవీ ని ఆయ‌న  డైరెక్ట్  చేస్తున్నార‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...