Home Film News Rohini: తండ్రి వ‌య‌స్సున్న వ్య‌క్తి నీకు ఛాన్స్ ఇస్తే నాకేంట‌ని అడిగాడు.. జ‌బ‌ర్ధ‌స్త్ రోహిణి స్ట‌న్నింగ్ కామెంట్స్
Film News

Rohini: తండ్రి వ‌య‌స్సున్న వ్య‌క్తి నీకు ఛాన్స్ ఇస్తే నాకేంట‌ని అడిగాడు.. జ‌బ‌ర్ధ‌స్త్ రోహిణి స్ట‌న్నింగ్ కామెంట్స్

Rohini: సీరియ‌ల్స్‌, షోస్‌, ప్రోగ్రామ్స్ ద్వారా మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న లేడి ఆర్టిస్ట్ రోహిణి.   ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ క‌నిపించి ఎంతో మంది ఆద‌ర‌ణ దక్కించుకుంది. ఇప్పుడు షోస్‌తో పాటు ప‌లు సినిమాల కూడా చేస్తూ చేతినిండా అవ‌కాశాల‌తో ఆమె ఫుల్ బిజీగా ఉంటోంది. కాగా,  2016లో రోహిణికి యాక్సిడెంట్ కాగా, డాక్ట‌ర్స్ ఆమె కాలికి రాడ్ వేశారు. న‌టిగా కెరీర్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆ రాడ్‌ను తొలగించ‌లేదు. ఇటీవ‌ల ఆమెకు కాలిలో నొప్పి మొదలు కావ‌డంతో వైద్యులను సంప్ర‌దించింది.  వారు యాక్సిడెంట్ స‌మ‌యంలో అమ‌ర్చిన రాడ్‌ను తొల‌గించారు.

రోహిణి మొద‌ట సీరియ‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డికి బిగ్ బాస్ ఆఫ‌ర్ ద‌క్కింది. బిగ్ బాస్ షోతో రోహిణి చాలా మంది నోటెడ్ అయింది.ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌లో కూడా ఈ అమ్మ‌డి హంగామా చాలానే ఉంది. ఏకంగా ఇప్పుడు టీం లీడ‌ర్‌గా ఉన్న రోహిణి.. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల సినిమా హీరోయిన్ల నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల వ‌ర‌కు నిర్భయంగా  మీడియా ముందుకు వ‌చ్చి త‌మ జీవితంలో ఎదురైన విచిత్ర ప‌రిస్థితులు గురించి చెప్పుకొస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రోహిణి కూడా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

మొదట్లో అవ‌కాశాల కోసం వెళ్లినప్పుడు సెక్స్ కావాలంటూ  కొంద‌రు అడిగారు. దాంతో అక్కడి నుంచి వెంట‌నే  వచ్చేశాను. మరో సారి అలానే ఆడిషన్స్ కోసం వెళ్తే అక్కడ నా తండ్రి వయసున్న ఓ వ్యక్తి నీకు ఛాన్స్ ఇస్తా  నాకేంటి అంటూ విచిత్రంగా అడిగాడు. అది కూడా సింపుల్ గా రిజెక్ట్ చేసి వచ్చేశానని తెలిపింది. నా కెరీర్‌లో ఇలా చాలా సార్లు జరిగింది. అలాంటి వాటికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. నా ట్యాలెంట్ కు ఏ ఛాన్స్ వస్తే దానితోనే సంతృప్తి పడుతూ ముందుకు వెళుతున్నాను. నా జీవితంలో నేను పెద్దగా గోల్స్ ఏమీ పెట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది రోహిణి. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సినీ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...