Home Film News Rajinikanth: మ‌ద్యం అతిగా తాగేవాడిన‌ని ఒప్పుకున్న ర‌జ‌నీకాంత్.. దాని వ‌ల్ల అది మిస్ అయ్యాను..!
Film News

Rajinikanth: మ‌ద్యం అతిగా తాగేవాడిన‌ని ఒప్పుకున్న ర‌జ‌నీకాంత్.. దాని వ‌ల్ల అది మిస్ అయ్యాను..!

Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దేశ‌, విదేశాల‌లో ఆయ‌న‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ర‌జ‌నీకాంత్ డైలాగ్స్‌కి, ఆయ‌న స్టైల్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక్క భాష‌లోనే కాకుండా అనేక భాష‌ల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ర‌జ‌నీకాంత్ ఇప్పటికీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉన్నారు. కాక‌పోతే ఆయ‌న నుండి మంచి హిట్ ఒక్క‌టి కూడా రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ జైల‌ర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు తలైవా ఫ్యాన్స్. రీసెంట్‌గా చిత్ర ఆడియో వేడుక చెన్నైలో జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌లో ర‌జనీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నేను గ‌తంలో  తెలియక చేసుకున్న మద్యం అలవాటు వ‌ల‌న  ఆరోగ్యం, ఆనందం రెండింటిపై తీవ్ర ప్రభావం  ప‌డింది. ఒక‌వేళ త‌నకు ఆల్కహాల్‌ అలవాటు కాకుంటే సమాజానికి మరింతగా సేవ చేసే అవకాశం దొరికేదని  అన్నారు. నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మద్యపానంకి అల‌వాటు కావ‌డ‌మే.  పూర్తిగా మద్యాన్ని మానేయాలని నేను ఎవ‌రికి చెప్ప‌ను కాని, కొన్ని సంతోష సందర్భాల్లో పరిమితిలో తాగండి అని చెప్పుకొచ్చారు. నిత్యం మ‌ద్యం సేవించ‌డం వ‌ల‌న ఆరోగ్యానికి, ఆనందానికి అది ప్ర‌మాదంగా మారుతుంద‌ని చెప్పుకొచ్చారు ర‌జ‌నీకాంత్‌.

అలానే త‌న తాజా చిత్రంలోని  ఓ పాటలో సూపర్‌స్టార్‌ అనే పదాన్ని ఉపయోగించడంపై రజనీకాంత్‌ స్పందిస్తూ… తనకు సూపర్‌స్టార్‌ అనే బిరుదు అస్సలు ఇష్టం ఉండదని, పాటలో ఆ పదాన్ని తీసివేయాలని దర్శకుడికి తాను సూచించినట్టు చెప్పుకొచ్చారు. చిత్రంలో  తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్ర‌లు పోషించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్  చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవ‌ల చిత్రం నుండి విడుద‌లైన  ‘కావాలయ్యా’ సాంగ్ విపరీతమైన ఆదరణ పొందింది. సామాన్యులు, సెలెబ్రిటీలు ఈ సాంగ్ కి స్టెప్స్ వేస్తూ నానా ర‌చ్చ చేస్తున్నారు.ఇక ‘జైలర్‌’ చిత్రం ఆగస్ట్‌ 10న విడుదల కానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...