Home Film News ఒక తమిళ ప్రామిసింగ్ డైరెక్టర్ పుట్టినరోజు
Film News

ఒక తమిళ ప్రామిసింగ్ డైరెక్టర్ పుట్టినరోజు

nelson dilipkumar birthday special

నెల్సన్ దిలీప్ కుమార్. ‘కొలమావు కోకిల’ అనే తన మొదటి సినిమాతోనే నార్వే-తమిళ్ సినిమా ఫెస్టివల్ లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్న యువ డైరెక్టర్. 2018 లో టైమ్స్ ఆఫ్ ఇండియా అతన్ని ఇండియాలో ఒకానొక ప్రామిసింగ్ డైరెక్టర్ గా తమ లిస్ట్ లో చేర్చింది. తమిళ చిత్ర పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు ఆయన గొప్ప సినిమాలతో, ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ ఆయనకి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.

విజువల్ కమ్యూనికేషన్ లో చెన్నై లోని న్యూ కాలేజ్ నుంచి డిగ్రీ సంపాదించిన నెల్సన్ 2016 లో వెట్టై మానన్ అనే సినిమా తీసాడు. 2018 లో ‘కొలమావు కోకిల’ అనే సినిమా వచ్చింది. ఈ సంవత్సరం ఇతని దర్శకత్వంలో ‘డాక్టర్’ అనే సినిమా శివ కార్తికేయన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద విడుదల అవనుంది. 2022 లో మరో సినిమా ‘తలపతి 65’ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ తమిళ దర్శకుడు 1984 జూన్ 21 న జన్మించారు. నేటితో ఆయనకి 37 ఏళ్ళు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...