Home Film News బాబీ డియోల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. బాబీ డియోల్ తో డేట్ చేసిన 10 మంది హీరోయిన్లు ఎవ‌రు..?
Film NewsSpecial Looks

బాబీ డియోల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. బాబీ డియోల్ తో డేట్ చేసిన 10 మంది హీరోయిన్లు ఎవ‌రు..?

బాబీ డియోల్.. ఎప్పుడైతే యానిమల్ సినిమా విడుదల అయిందో అప్పటి నుంచి ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ముఖ్యంగా ఆయ‌న‌ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయారు. సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపుర, రష్మిక మంద‌న్నా జంటగా నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రను పోషిస్తే.. మెయిన విలన్ గా బాబీ డియోల్ నటించారు. బాబీ డియోల్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినప్పటికీ.. తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేశారు. యానిమల్ గ్రాండ్ సక్సెస్ తో ప్రస్తుతం బాబీ డియోల్ కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు ఆయన బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బాబీ డియోల్ గురించి అనేక ఆసక్తికర విషయాలు ఈ ఇక్క‌డ‌ తెలుసుకుందాం.

Bobby Deol | Bobby Deol says 2023 has been 'amazing' for the Deol family so  far - Telegraph India

బాబీ డియోల్ అసలు పేరు విజయ్ సింగ్ డియోల్. 1969 జనవరి 27న ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ధర్మేంద్ర బాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా నిర్మాతగా సత్తా చాటారు. అలాగే తల్లి ప్రకాష్ కౌర్‌ గృహిణి. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు నాలుగో సంతానంగా బాబీ డియోల్ జ‌న్మించాడు. బాబా డియోల్ అన్న మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్. అలాగే విజయతా, అజీత అనే ఇద్ద‌రు అక్క‌లు కూడా బాబీ డియోల్ కి ఉన్నారు. వీరు కాలిఫోర్నియాలో స్థిర‌ప‌డ్డాడు. న‌లుగురు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత ధ‌ర్మేంద్ర త‌న కోస్టార్ హేమ మాలినితో ప్రేమ‌లో ప‌డి రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఈషా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దురు కుమార్తెలు జ‌న్మించారు. బాబీ డియోల్ విష‌యానికి వ‌స్తే.. చిన్న‌త‌నం నుంచి సినిమా వాతావ‌ర‌ణంలోనే పెర‌గ‌డం వ‌ల్ల అత‌నికి కూడా న‌ట‌న‌పై ఆస‌క్తి క‌లిగింది. బాబీ డియోల్ విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది.

Bobby Deol | Bobby Deol talks about south debut, thanks fans for showering  love on Animal - Telegraph India

ప్లస్ 2 అయిన వెంటనే అత‌ను యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. 1977లో బాబీ డియోల్ మొదటిసారిగా పదేళ్ల వయసులోనే ధరమ్ వీర్ చిత్రంలో బాలనటుడిగా వెండితెర‌పై కనిపించాడు. ఆ త‌ర్వాత రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన బర్సాత్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ గా న‌టించింది. 1995లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్‌గా బాబీ డియోల్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. అలాగే బర్సాత్ లో బాబీ డియోల్ హెయిర్ స్టైల్‌, లుక్‌, ప‌ర్స‌నాలిటీ యూత్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. బాబీ డియోల్ కు భారీ స్థాయిలో లేడీ ఫాయింగ్ ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే.. బ‌ర్సాత్ త‌ర్వాత బాబీ డియోల్ చేసిన గుప్త్: ది హిడెన్ ట్రూత్, ఔర్ ప్యార్ హో గయా, కరీబ్ వంటి సినిమాల‌న్నీ వ‌రుస విజ‌యాలు సాధించాయి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోగా బాబీ డియోల్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Bobby Deol And Tanya Deol's Love Story, How He Rang Her At Midnight To Ask  Her Out On A Date

అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే స్టార్డ‌మ్ రావ‌డంతో బాబీ డియోల్ కు పొగ‌రు కూడా పెరిగింది. ప‌బ్స్‌, పార్ట్స్‌, డ్రింక్స్ అంటూ చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డ్డారు. షూటింగ్స్ కు స‌రిగ్గా రాక‌పోవ‌డం, వ‌చ్చినా మ‌ధ్య‌లోనే వెళ్లిపోవ‌డం, లోకేష‌న్ లో మ‌ద్యం తీసుకోవ‌డం వంటివి చేసేవారు. ఈ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీలో బాబీ డియోల్‌పై నెగ‌టివ్ ఇంప్రెష‌న్ ఏర్ప‌డింది. ఇదే త‌రుణంలో బాబీ డియోల్ కెరీర్ కూడా డౌన్ అవ్వ‌డం స్టార్ట్ అయింది. 1995 నుంచి 2002 వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోగా స‌త్తా చాటిన బాబీ డియోల్‌.. ఆ త‌ర్వాత ప‌ర‌జ‌యాల్లో కూరుకుపోయారు. హీరోగా చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపుల బాట ప‌డ్డాయి. ఒక‌టి రెండు హిట్లు ప‌డినా అవి అత‌ని కెరీర్ ను నిల‌బెట్ట‌లేక‌పోయాయి. దాంతో అత‌నికి గెస్ట్ రోల్స్‌, క్యారెక్ట‌ర్ రోల్స్ రావ‌డం ప్రారంభం అయ్యాయి. అటువంటి ఛాన్సుల‌తో బాబీ డియోల్ మాన‌సికంగా బాగా కృంగిపోయారు. తాగుడుకు, మ‌త్తుమందుల‌కు బానిస అయ్యారు. 2013 త‌ర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న బాబీ డియోల్‌.. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం ఢిల్లీలోని ఓ నైట్ ప‌బ్‌లో డీజేగా జాయిన్ అయ్యారు.

Kareena Kapoor's fight with Bobby Deol's wife: Don't deny a problem with  Bobby's wife (Throwback) - IBTimes India

అయితే ఆ స‌మ‌యంలో అత‌ని సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో.. చాలా మంది బాబీ డియోల్‌ను ట్రోల్ చేశారు. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా స‌త్తా చాటిన బాబీ డియోల్ ఇప్పుడు అవ‌కాశాలు లేక బ‌తుకుతెరువు కోసం డీజేగా చేస్తున్నాడంటూ ఏవేవో వార్త‌లు రాశారు. దాంతో డీజేగా ప‌ని చేయ‌డం మానేసిన బాబీ డియోల్ చాలా ఏళ్లు ఇంట్లోనే ఉన్నాడు. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత రియ‌లైజ్ అయిన బాబీ డియోల్‌.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. షేపౌట్ అయిన బాడీని ఫిట్ గా మార్చుకున్నారు. పోస్ట‌ర్ బాయ్స్ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఆశ్ర‌మం అనే వెబ్ సిరీస్ తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు. ఈ సిరీస్ భారీ విజ‌యాన్ని సాధించింది. ఇందులో నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ లో బాబీ డియోల్ మ్యాజిక్ సృష్టించారు. ఈ సిరీస్ ద్వారా బాబీ డియోల్ త‌న‌లోని పూర్తి స్థాయి నటుడిని బ‌య‌ట‌కు తీశారు. ఇక ఇటీవ‌ల విడుద‌లైన యానిమ‌ల్ మూవీ బాబీ డియోల్ ను నార్త్ తో పాటు సౌత్ ప్రేక్ష‌కుల‌కు సైతం ద‌గ్గ‌ర చేసింది. చాలా ఏళ్ల నుంచి స‌రైన అవ‌కాశాలు రాక స‌త‌మ‌తం అయిన బాబీ డియోల్.. ప్ర‌స్తుతం వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. బాబీ డియోల్ 1996లో తాన్యా అహుజాను పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం.

When Neelam Addressed The Rumours Of Leaving Bobby Deol Because Of Pooja  Bhatt: "I Would Never Be Happy With Him..."

వీరికి ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్ అనే ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు. అయితే సినిమాల ద్వారానే కాకుండా హీరోయిన్లతో ల‌వ్ ఎఫైర్ల ద్వారా కూడా బాబీ డియోల్ బాగా పాపుల‌ర్ అయ్యారు. కాలేజీ రోజుల నుంచి ప‌బ్స్‌, పార్టీలు అంటూ బాబీ డియోల్ త‌న తండ్రి సంపాదించిన డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు పెట్టేవాడు. అలా ఓ పార్టీలో పాపుల‌ర్ హీరోయిన్ నీలం కొఠారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దాదాపు ఐదేళ్లు బాబీ డియోల్, నీలం డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ, బాబీ డియోల్ తండ్రి ధ‌ర్మేంద్ర అందుకు అంగ్రీక‌రించ‌లేదు. దాంతో బాబీ డియోల్, నీలం బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత బాబీ డియోల్ హీరో అవ్వ‌డం, స్టార్డ‌మ్ ద‌క్కించుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. ఆ టైమ్ లోనే ధ‌ర్మేంద్ర తాన్యా అహుజాతో కుమారుడికి పెళ్లి జ‌రిపించారు. అయితే వివాహం అయినా కూడా బాబీ డియోల్ మాత్రం ల‌వ‌ర్ బాయ్‌లాగానే ప్ర‌వ‌రించేవాడు. త‌న తొలి సినిమా హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా నుంచి ప్రీతి జింటా, ఊర్మిళ మతోండ్కర్, రాణి ముఖర్జీ, లారా దత్తా, ప్రియా చత్వాల్, ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్ల‌తో బాబీ డియోల్ డేటింగ్ చేశారు. అయితే హీరోయిన్ అమీషా ప‌టేల్ ను మాత్రం బాబీ డియోల్ సీరియ‌స్ గా ల‌వ్ చేశారు. ఆమె కోసం త‌న భార్య‌కు విడాకులు ఇవ్వాల‌ని కూడా అనుకున్నార‌ట‌. కానీ, తండ్రి ధ‌ర్మేంద్ర క‌ల‌గ‌జేసుకుంది బాబీ డియోల్ తో పాటు అమీషా ప‌టేల్‌కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారట‌. దాంతో వారు త‌మ రిలేష‌న్‌కు పులిస్టాప్ పెట్టేశార‌ని బాలీవుడ్ లో టాక్ ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...