Home Film News Pawan Kalyan Heroine: ఆ కేసులో లొంగిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్.. ముసుగు కప్పుకొని మ‌రీ..!
Film News

Pawan Kalyan Heroine: ఆ కేసులో లొంగిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్.. ముసుగు కప్పుకొని మ‌రీ..!

Pawan Kalyan Heroine: టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఇందులో కొంద‌రికి అదృష్టం క‌లిసి వ‌చ్చి ఎక్కువ కాలం కొన‌సాగితే మ‌రి కొంద‌రు మాత్రం మ‌ధ్య‌లోనే ప‌రిశ్ర‌మ నుండి ప‌క్క‌కు జ‌ర‌గాల్సి వ‌చ్చింది. అయితే బాలీవుడ్ నుండి వ‌చ్చి టాలీవుడ్‌లో మంచి విజ‌యాలు చ‌వి చూసిన భామ అమీషా ప‌టేల్. ఈ అమ్మ‌డు  2000 ‘కహో నా ప్యార్ హై’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన  అమీషా పటేల్ తెలుగు లో కూడా నటించింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బద్రి సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

తాజాగా అమీషా ప‌టేల్..  ఓ కేసులో ఇరుక్కోవడమే కాకుండా.. కోర్టులో కూడా సరెండర్ అయ్యింది కూడా. జూన్ 17  ఉదయం రాంచి సివిల్‌ కోర్టులో ఆమె లొంగిపోవ‌ల్సి వ‌చ్చింది.  సినిమా నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్‌ కుమార్‌.. అమీషా పటేల్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు వేయ‌డంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అత‌ను త‌న పిటీష‌న్‌లో అమీషా ప‌టేల్‌.. సినిమా నిర్మిస్తానంటూ త‌న  దగ్గర 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నదని,  ఇంత వ‌ర‌కు ఆ సినిమా చేయ‌లేదు అలానే డ‌బ్బు తిరిగి ఇవ్వ‌లేదు అని తెలియ‌జేశాడు. ఇప్పుడు త‌న‌కు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం .3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును ఆశ్ర‌యించాడు.

అయితే ఈ కేసు విచారణ చేప‌ట్టిన‌ కోర్టు ఏప్రిల్‌ నెల 6న అమీషా ప‌టేల్‌కు వారెంట్‌ ఇష్యూ చేయ‌గా, ఇప్పుడు హాజ‌రైంది.  అయితే ప‌లు ష‌ర‌తుల‌తో ఆమెకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  కోర్టు నుంచి అమీషా పటేల్ బయటకు వచ్చే సమయంలో మీడియా వాళ్లు ఫొటోలు తీసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆమె తలకు ముసుగు కప్పుకొని ఎవరినీ పట్టించుకోకుండా సీరియ‌స్‌గా కారు ఎక్కి  అక్కడ నుంచి వెళ్లిపోయింది.  ముసుగులో అమీషా ప‌టేల్  కోర్టు నుంచి బయటకు రావడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మీడియా ప్ర‌తినిథులు ఎన్ని ప్ర‌శ్నలు వేసిన కూడా అవేమి ప‌ట్టించుకోకుండా ఆమె స్పీడ్‌గా వెళ్లిపోవ‌డం గ‌మ‌న‌ర్హం.

Related Articles

షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!

తెలుగు బుల్లితెరపై సంచలన విజయాలు అందుకున్న సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్...

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...