Home Film News షూటింగ్ ఎలాగైనా అక్కడే చేస్తానంటున్న గుణశేఖర్
Film News

షూటింగ్ ఎలాగైనా అక్కడే చేస్తానంటున్న గుణశేఖర్

GunaShekhar Wants To Shoot There No Matter What

గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా నిర్మాణంపై పనిచేస్తూ.. ఒక్కొక్కరిగా నటీనటులను కూడా ఎంచుకుంటున్నాడు. ఐతే ఇప్పటికే సమంతాని ప్రధాన పాత్రలో.. అలాగే, మలయాళ ఇండస్ట్రీ నుంచి దేవ్ మోహన్ ఇద్దరూ ఈ మూవీలో జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కూడా ఇందులో జాయిన్ అవబోతున్న విషయం తెలిసిందే.

ఐతే, గుణ శేఖర్ పనిలో పనిగా ఈ మూవీని షూట్ చేయడానికి ప్లేస్ లని వెతుకుతూనే ఉన్నాడు. ఆ కథకి తగ్గట్టుగా ఉండే ప్రదేశాలని ఎంచుకోవడంలో బాగా బిజీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇందుకోసం గుణశేఖర్ మన తెలుగు రాష్ట్రాలలో సౌలభ్యంగా ఉన్న ప్రాంతాలనే ముందుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో ముఖ్యంగా గండిపేట చెరువు ప్రాంతంలో సినిమాకి సంబంధించిన షూట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ, కరోనా నిబంధనల మూలంగా అక్కడ ప్రస్తుతం షూటింగ్ లని నిర్వహించే పరిస్తితి లేదని తెలుస్తుంది. అయినా పర్మిషన్ తీసుకుని కచ్చితంగా అక్కడే షూట్ చేసే ఆలోచనలో ఉన్నాడు గుణ శేఖర్. ఇందుకోసం అక్కడి యాజమాన్యాన్ని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. పౌరాణిక డ్రామాగా వస్తున్న ఈ మూవీపైన ప్రేక్షకులకి చాలానే అంచనాలు ఉన్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...