Home Film News టాలీవుడ్‌లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్.. ఈమెని గుర్తుపట్టారా
Film News

టాలీవుడ్‌లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్.. ఈమెని గుర్తుపట్టారా

ఇంతకుముందు చెప్పుకున్నట్టు సోషల్ మీడియా వల్ల కనుమరుగైపోయిన సెలబ్రిటీలను మళ్లీ చూడగలుగుతున్నాం. వాళ్ల గురించిన వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పటికే పలువురు నటీనటులను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కనుగొన్నాం. రీసెంట్‌గా పాపులర్ క్యారెక్టర్ యాక్ట్రెస్ వర్ష ప్రొఫైల్ నెట్టింట కనిపించింది.

వర్ష.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు. వినోద్ కుమార్, మీనా నటించిన పంజరం మూవీతో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన వర్ష, మోహన్ బాబు ఖైదీ గారు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. నువ్వే కావాలి, సుస్వాగతం, సూర్యవంశం, కన్యాదానం, తమ్ముడు, యువరాజు, నువ్వువస్తావని, వాసు, శివరామరాజు, నాగ, సత్యం, మాస్.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చివరిగా 2005లో రాజశేఖర్ నాయకుడు మూవీలో కనిపించిన వర్ష అదే ఏడాది ఓ కన్నడ సినిమా కూడా చేసింది.. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

https://www.instagram.com/p/CbHSXADr3Pa/

చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల కంట పడింది. పెళ్లి తర్వాత కాస్త ఒళ్లు చేసినప్పటికీ ఏమాత్రం గ్లామర్ చెక్కు చెదరకుండా నిండుగా అచ్చతెలుగు కట్టూ బొట్టుతో ఉన్న వర్షను చూసి ఆడియన్స్ షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్స్, ట్రెండీ రీల్స్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుందామె. సీరియల్స్‌తో పాటు మంచి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తే సినిమాలతోనూ రీ ఎంట్రీ ఇస్తానంటోంది. వర్ష పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CeI9JdjA_Bw/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...