Home Film News హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో డెబ్యూ ఫిల్మ్!
Film News

హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో డెబ్యూ ఫిల్మ్!

Harbhajan Singh Debut Film

క్రికెట్ ఫేమ్ హర్భజన్ సింగ్ ఇప్పుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడు. తను ఎంచుకున్న గేమ్ లో మంచి సక్సెస్ చూసిన బజ్జీ తన సినీ ప్రవేశాన్ని పంజాబీలోనో, హిందీ లోనో కాకుండా తమిళంలో మొదలుపెట్టాడు. ఈ సినిమా ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. ఈ రోజు హర్భజన్ సింగ్ పుట్టిన రోజు కూడా కావడంతో తన ఫాన్స్ అందరికీ ఈ శుభవార్తని షేర్ చేసాడు హర్భజన్ సింగ్.

మూవీకి ‘ఫ్రెండ్షిప్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర అర్జున్ కూడా ప్లే చేయడం మరో విశేషం. ఇదే రోజు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. ‘అరిచి అరగదీయమ్మా’ అనే పాటను కూడా రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో డాన్స్ ఇరగదీస్తున్న బజ్జీ తెర మీద తన యాక్టింగ్ ఎలా చేస్తాడో చూడాలి. ఎ. ఎన్. బాలాజీ నిర్మాతగా, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. డీ. ఎమ్ ఉదయ్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని జాన్ పాల్ రాజ్ & శామ్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన Losliya Mariyansan అని తెలుస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...