Home Film News Akira: జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న అకీరా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన రేణూ దేశాయ్
Film News

Akira: జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న అకీరా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన రేణూ దేశాయ్

Akira: టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్నాళ్ల పాటు రేణూ దేశాయ్‌తో స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ జంట‌కి అకీరా, ఆద్య అనే ఇద్ద‌రు పిల్ల‌లు కూడా జ‌న్మించారు. ప్ర‌స్తుతం రేణూ త‌న ఇద్ద‌రు  పిల్లల బాధ్యతలు మోస్తూనే అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. రేణూ దేశాయ్ .. బద్రి  సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా,  ఇది రేణూ దేశాయ్‌కి తొలి సినిమా  అనే విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది రేణూ దేశాయ్. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి క్లారిటీ లేదు.

అయితే  పవన్ కళ్యాణ్ నుండి రేణూ ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుండి  రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి బోలెడన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో రేణూ దేశాయ్‌ని కొంద‌రు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. దానిని రేణూ కూడా తిప్పి కొట్టింది. అయితే పిల్ల‌లని స‌క్ర‌మంగా పెంచుతూ అప్పుడ‌ప్పుడు వారికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది రేణూ దేశాయ్. తాజాగా అకీరాకి సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాలో షేర్ చేసి తెగ మురిసిపోయింది.ఆరున్న‌ర అడుగులు ఉన్న అకీరా తాజాగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోని రేణూ దేశాయ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ వీడియోకి ఆసక్తికర కామెంట్ కూడా పెట్టారు.

నా త‌న‌యుడు అకీరా నందన్ జిమ్ చేస్తూ తెలుగు, హిందీ మ్యూజిక్ వింటున్నాడు. ఇప్పుడు చాలా గర్వంగా ఫీలవుతున్నాను.  సెన్స్ లేని లౌడ్ ఇంగ్లీష్ మ్యూజిక్ కాకుండా సొంత భాషల మ్యూజిక్ వినడం గొప్ప విషయం అంటూ రేణూ దేశాయ్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఏది ఏమైన ఇప్పుడు అకీరా వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక ఈ వీడియోకి నెటిజ‌న్స్ ఎప్ప‌టిలానే కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ రాబోతున్నాడు. తండ్రిని మించిన త‌న‌యుడు త‌ప్ప‌క అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అకీరా మ‌ల్టీ టాలెంటెడ్ అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...