Home Film News Adipurush Director: తిరుమ‌ల మాడ వీధుల్లో కృతిస‌న‌న్‌కి ముద్దు పెట్టిన ఆది పురుష్ డైరెక్ట‌ర్..!
Film News

Adipurush Director: తిరుమ‌ల మాడ వీధుల్లో కృతిస‌న‌న్‌కి ముద్దు పెట్టిన ఆది పురుష్ డైరెక్ట‌ర్..!

Adipurush Director: ప్ర‌భాస్,కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భార‌తీయ ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా ఓం రౌత్ తెర‌కెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ చిత్రంలో రాఘ‌వుడిగా ప్ర‌భాస్ , జాన‌కిగా కృతి స‌న‌న్ , లంకాధిప‌తి రావ‌ణాసురుడుగా సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. ఇక రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తున్నారు. తిరుప‌తిలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందం అంతా హాజ‌ర‌య్యారు.

ఇక బుధ‌వారం ఉద‌యం చిత్ర దర్శ‌కుడు ఓం రౌత్‌, హీరోయిన్ కృతి స‌న‌న్ తో పాటు మ‌రి కొంద‌రు టీమ్ స‌భ్యులు క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అయితే వారు ద‌ర్శ‌నం చేసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత వారు చేసిన ప‌ని వివాదంలో ప‌డేసింది. దర్శ‌నం త‌ర్వాత హీరోయిన్ వెళుతుండ‌గా, ఆమెకు బై చెప్పి కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టారు ఓం రౌత్‌. పెక్ స్టైల్ ముద్దు పెట్టిన త‌ర్వాత మనోడు ఫ్ల‌యింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఇదంతా వీడియోలో రికార్డ్ కావ‌డంతో ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అయితే ద‌ర్శ‌కుడి ప్ర‌వ‌ర్త‌న‌పై కొంద‌రు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.. తిరుమ‌ల కొండ‌పై ఇలా చేయ‌ట‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

మరోవైపు మాడ వీధుల్లో చెప్పుల‌తో తిరిగారు అంటూ కృతి స‌న‌న్‌, ద‌ర్శ‌కుడిపై మండిప‌డుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటాలు బైబై లు చెప్పుకోవడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ కూడా ఇదే అయిన‌ప్ప‌టికీ , తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న ఇలా చేయ‌డం ప‌ద్ద‌తి కాదంటూ భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో న‌య‌న‌తార , విఘ్నేష్ శివ‌న్ మాడ వీధుల్లో చెప్పుల‌తో న‌డ‌వ‌డం పెద్ద వివాదాస్ప‌దంగా మారింది. మ‌రి ఇప్పుడు ద‌ర్శ‌కుడు, హీరోయిన్ చేసిన ప‌నికి వారు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

 

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...