Home Film News Adipurush Sequel: మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్‌కి సీక్వెలా.. వ‌ద్దు బాబోయ్ అంటు సినీ ప్రియులు
Film News

Adipurush Sequel: మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్‌కి సీక్వెలా.. వ‌ద్దు బాబోయ్ అంటు సినీ ప్రియులు

Adipurush Sequel: ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ తెర‌కెక్కించిన ఆదిపురుష్ చిత్రం ఎన్ని విమ‌ర్శ‌ల‌ని మూట‌గ‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల‌లోను ఈ సినిమాపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. కొంద‌రు సినిమాని బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది వాల్మీకి రామాయ‌ణంలా లేద‌ని, ఓం రౌత్ రామాయ‌ణం మాదిరిగా ఉంద‌ని తిట్టిపోస్తున్నారు. చిత్రం రిలీజ్ కి ముందు ఆదిపురుష్ చిత్రం భారీ అంచ‌నాలు పెంచుకుంది.  అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో అయితే ఆదిపురుష్‌ చిత్రం అద్భుతాలు సృష్టించింది. ముగ్గురు ఖాన్స్‌కి కూడా ఇది సాధ్యం కాలేద‌ని ట్రేడ్ పండితులు చెప్పారు.
Adipurush
భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఆదిపురుష్ చిత్రం  మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ రాబ‌ట్టి ఔరా అనిపించింది. అయితే నాలుగో రోజు నుండి క‌లెక్ష‌న్స్ చాలా ప‌డిపోయాయి. ఈ సినిమా అటు  బయ్యర్స్ కి మరియు ఇటు నిర్మాతలకు కనీసం వంద కోట్ల రూపాయిలు నష్టాన్ని కలిగించేలా ఉంది. టీజ‌ర్ నుండే సినిమా కాస్త తేడా కొట్ట‌గా, ట్రైల‌ర్‌తో కాస్త అంచ‌నాలు పెంచాడు ఓం రౌత్. ఇక సినిమా విడుద‌లైన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు అందులోని లోపాల‌ను ఎత్తి చూప‌డ‌మే త‌ప్ప సినిమాలో ఇది బాగుంది అని మాట్లాడుకున్న వారు లేరు.

అయితే సినిమా ఇన్ని దారుణ‌మైన విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న స‌మ‌యంలో ఓం రౌత్ దీనికి సీక్వెల్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.  శ్రీ రాముడి అరణ్య వాసం, ఆ తర్వాత రాముడు ఆమెని అపహరించడం,శ్రీ రాముడు లంక కి వెళ్లి రావణుడిని హరించడం వంటివి ఆదిపురుష్‌లో చూపించారు. సీక్వెల్‌లో  అయోధ్య కి పట్టాభిషేకం చేసిన తర్వాత రాముడు సీతని అడవుల పాలు చెయ్యడం, ఆ తర్వాత సీత దేవి పడిన కష్టాలని చూపించాల‌ని అనుకుంటున్నాడ‌ట ఓం రౌత్‌.  ఈ క్ర‌మంలో ప్ర‌భాస్‌ని క‌లిసి డిస్క‌ష‌న్ చేయ‌గా, దానిని ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తుంది.  ప్ర‌భాస్ త్వ‌ర‌లో స‌లార్ చిత్రంతో ప‌ల‌కరించ‌నున్న విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...