Home Film News Chiranjeevi Flops: చిరంజీవికి వ‌రుస ఫ్లాపులు.. ఆ వ్య‌క్తి వ‌ల్ల‌నే ఇలా అంటూ కొత్త చ‌ర్చ‌
Film News

Chiranjeevi Flops: చిరంజీవికి వ‌రుస ఫ్లాపులు.. ఆ వ్య‌క్తి వ‌ల్ల‌నే ఇలా అంటూ కొత్త చ‌ర్చ‌

Chiranjeevi Flops: మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న చేసిన సినిమాల‌లో చాలా సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల‌ని బ‌ద్దలు కొట్టాయి.అయితే చిరు కెరీర్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుండ‌గా, మ‌ధ్యలో రాజ‌కీయాల‌లోకి వెళ్లారు.తొమ్మిదేళ్ల పాటు రాజ‌కీయాల‌లో ఉన్న త‌ర్వాత ఖైదీ నెం 150 సినిమాతో తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి ప్రేక్ష‌కుల‌ని, అభిమానులకి మంచి జోష్ అందించింది. ఈ సినిమా తర్వాత చిరు చేసిన సినిమాలు పెద్ద‌గా విజ‌యాలు సాధించ‌డం లేదు. గత నాలుగు సినిమాలలో ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు దారుణ‌మైన నిరాశ మిగిల్చాయి.

ఈ మూడు సినిమాలు కూడా దారుణంగా  ఫ్లాప్ కావ‌డం, భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించకపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం  ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే చిరంజీవి న‌టించిన ఆ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి ఒక వ్య‌క్తి కార‌ణ‌మంటూ నెటిజన్స్ వింత కార‌ణం చెబుతున్నారు. ఆచార్య‌,గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్ చిత్రాల‌లో  ఒక వ్యక్తి నటించాడని అతని వల్లే సినిమా ఫ్లాపైందని అంటున్నారు. వివ‌రాల‌లోకి వెళితే  మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్.. చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు .ఫ్లాపైన  మూడు సినిమాలలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలలో కొణిదెల పవన్ తేజ్ క‌నిపించి సంద‌డి చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌వ‌న్ తేజ్ న‌టించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో   చిరంజీవి తన సినిమాలలో కొణిదెల పవన్ తేజ్ ను ఎంచుకోవద్దని నెటిజన్ల నుంచి ప‌లు అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.అయితే మ‌రికొంద‌రు వీటిని కొట్టి పారేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే త‌ప్ప‌క  స‌క్సెస్ అవుతుంది. ఈ చెత్త కార‌ణాలు వెత‌కొద్దు అని మ‌రి కొంద‌రు సూచిస్తున్నారు. ఇక  చిరంజీవి సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ రేంజ్ లో కలెక్షన్లు రాబ‌ట్ట‌లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. రానున్న రోజుల‌లో అయిన చిరు త‌న సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సినిమాలు హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...