Home Film News హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ ‘ రివ్యూ.. మరోసారి సిద్ధార్థ్‌ ఆనంద్- హృతిక్ తో తన మ్యాజిక్ ని రిపీట్ చేశాడుగా..!
Film NewsReviews

హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ ‘ రివ్యూ.. మరోసారి సిద్ధార్థ్‌ ఆనంద్- హృతిక్ తో తన మ్యాజిక్ ని రిపీట్ చేశాడుగా..!

బాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ ఫైటర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపకా పదుకొనే జంటగా నటించిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఏంటి..? మూవీ ఎలా ఉంది..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Hrithik Roshan's Fighter Review: Aerial Thrills

హృతిక్ రోషన్‌తో వార్, షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న మూవీ కూడా ఇదే.. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే ఏరియల్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఏరియల్ కాంబాట్, ఎమోషన్స్, దేశభక్తి మరియు డ్రామా అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందించుటమే కాకుండా దేశ‌ రక్షణ కోసం పాటుప‌డుతున్న వీరులందరికీ ఫైటర్ ఘన నివాళి అర్పిస్తుందని చెప్పవచ్చు.

సిద్ధార్థ్‌ ఆనంద్ గత సినిమాలైనా పఠాన్, జవాన్ సినిమాలు రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఫైటర్ విషయంలో మాత్రం అలాంటివి ఎక్కడా కనిపించలేదు.. అసలు ఈ సినిమా మీద ఎవరు అంతగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. అయితే ఈ సినిమా విడుదల త‌ర్వాత‌ మాత్రం తన జోరును చూపిస్తుందనే చెప్పాలి. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో రివ్యూలు కూడా వైరల్ అవుతున్నాయి.

Fighter Trailer Impact At Box Office Day 1: Hrithik Roshan Is All Set To Do  Some Bang Bang Winning The BO War With Pathaan's Rubia Deepika Padukone!

అదేవిధంగా ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్, సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయాయని అంటున్నారు. అంతేకాదు మూవీ క్రిటిక్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా హృతిక్ వ‌న్‌మ్య‌న్ షో అనే చేప్ప‌లి. అదే విధంగా దీపిక – హృతిక్ కెమిస్ట్రీ కూడా ఎంతో సూప‌ర్బ్‌గా ఉంది. అనిల్ క‌పూర్ ఎప్ప‌టిలాగే అద్భుతంగా న‌టించారు.. సెకండాఫ్ ఫైట‌ర్ సినిమాకు ప్ర‌ధాన బ‌లం అని.. సినిమాలో విజిల్స్ వేయించుకునే యాక్ష‌న్ సీన్లు, డైలాగులు ఎన్నో ఉన్నాయి.

Fighter Review - Bollymoviereviewz

ఈ సినిమాతో హృతిక్ భారీ హిట్ అందుకున్న‌డు అనే చెప్ప‌లి.. సినిమాలో బీజీఎంతో పాటు గ్రాఫిక్స్‌, సినిమాటోగ్ర‌ఫీ, డైరెక్ష‌న్ అన్నీ అదిరిపోయాయి. దేశ‌భ‌క్తి ఉన్న ఇలాంటి ఏరియ‌ల్ యాక్ష‌న్ సినిమాను తాము ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని కూడా కొంద‌రు చెపుతున్నారు. అనిల్ క‌పూర్ సినిమాకు ఆత్మ అని.. ఫైట‌ర్ దీపిక కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచిపోతుంద‌నీ ఎక్కువ మంది చెపుతున్నారు. ఫైన‌ల్‌గా ఫైట‌ర్.. వార్‌, ప‌ఠాన్ రేంజ్ సినిమా కాక‌పోయినా హృతిక్-సిద్ధార్థ్‌ ఆనంద్ కాంబోలో మరో సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ట్రీట్ ని చూడాలి అనుకునే వారు ఈ మూవీనీ ఈ వారాంతంలో తప్పకుండా చూడవచ్చు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...