Home Film News Dil Raju: దిల్ రాజు ఇంటికి క్యూ క‌ట్ట‌నున్న‌సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు.. ఎందుకంటే..!
Film News

Dil Raju: దిల్ రాజు ఇంటికి క్యూ క‌ట్ట‌నున్న‌సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు.. ఎందుకంటే..!

Dil Raju: డిస్ట్రిబ్యూట‌ర్‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేసి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ఎదిగారు దిల్ రాజు. ఇప్పుడు ఆయ‌న పెద్ద హీరోల‌తో సినిమాలు చేస్తూనే అప్పుడ‌ప్పుడు బ‌ల‌గం లాంటి చిన్న సినిమాలు సైతం నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కెరీర్ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.ఇక ప‌ర్స‌న‌ల్ విష‌యానికి వ‌స్తే.. కొంత కాలం క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆమె చనిపోయిన మూడేళ్ల‌ త‌ర్వాత తేజ‌స్విని అనే యువ‌తిని రెండో పెళ్లి చేసుకున్నారు.  గత ఏడాది ఈ జంటకు ఒక‌ కుమారుడు కూడా జన్మించాడు.

జూన్ 29న దిల్ రాజు ఫ‌స్ట్ బ‌ర్త్ డే కాగా, ఆయ‌న ఈ రోజు సాయంత్రం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. జేఆర్సీ క‌న్వెన్షన్ హాల్ లో ఈ పార్టీని నిర్వ‌హించ‌బోతున్నారని, ఈ పార్టీకి సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయకులు భారీ ఎత్తున రానున్న‌ట్టు స‌మాచారం. చాలా రోజుల త‌ర్వాత సెలబ్స్ అంద‌రు ఒకే చోట‌కి చేర‌నుండ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ పార్టీపై ప‌డింది. ఇక దిల్ రాజు ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి కూడా బలగం చిత్రంతో నిర్మాతగా మారిన విషయం విదితమే.

గేమ్ ఛేంజ‌ర్ చిత్రాన్ని 2024 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాలని అనుకుంటున్నార‌ట‌. ఈ మూవీలో  బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  రాజోలు భామ అంజ‌లి లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. దిల్ రాజు ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనం అందించ‌గా,.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదని ఇటీవ‌ల చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...