Home Film News Venumadhav: వేణు మాధ‌వ్ మ‌మ్మ‌ల్ని వాడుకొని మోసం చేశాడు.. న‌టి సంచ‌ల‌న కామెంట్స్
Film News

Venumadhav: వేణు మాధ‌వ్ మ‌మ్మ‌ల్ని వాడుకొని మోసం చేశాడు.. న‌టి సంచ‌ల‌న కామెంట్స్

Venumadhav: టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడీయ‌న్స్‌లో వేణు మాధ‌వ్ ఒక‌రు. మంచి మిమిక్రీగా ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వేణు మాధ‌వ్ కమెడీయ‌న్‌గా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించి పెద్ద క‌మెడీయ‌న్‌గా కూడా మారాడు. అయితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో వేణు మాధ‌వ్ చిన్న వ‌య‌స్సులోనే క‌న్నుమూశారు. అయితే తాజాగా వేణు మాధ‌వ్ గురించి జ‌యంతి ప‌ద్మ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ప‌ద్మ‌ దాదాపు 400 సినిమాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఇటీవ‌లి కాలంలో పెద్దగా సినిమాల‌లో క‌నిపించ‌ని జ‌యంతి ప‌ద్మ‌ ఇప్పుడు వేణు మాధ‌వ్ గురించి దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల‌లో నిలిచింది.

జ‌యంతి ప‌ద్మ మాట్లాడుతూ.. వేణు మాధ‌వ్.. మా వారి స్నేహితుడి వ‌ల‌న ప‌రిచయం అయ్యారు.వేణు మాధ‌వ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో క్యారియ‌ర్ పంపించ‌మ‌ని మా వారికి ఫోన్ చేశారు. షూటింగ్స్ అప్పుడు కూడా మా వారికి కాల్ చేస్తే మా ఇంటి నుండే భోజ‌నం పంపేవాళ్లం.దానిని న‌లుగురు త‌ప్పుగా అనుకున్నారు. అయితే వేణు మాధవ్ మెల్ల‌గా అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం, బిజీ ఆర్టిస్ట్ కావ‌డంతో ఆయ‌న ఏమ‌న్నా క్యారెక్ట‌ర్స్ ఇప్పిస్తాడేమో అనుకున్నాను. కాని తాను మ‌మ్మ‌ల్ని వాడుకున్నాడే త‌ప్ప ఎలాంటి సాయం చేయ‌లేదు.  అంతేకాదు ప‌లు కార‌ణాలు చెప్పి డ‌బ్బులు కూడా తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వ‌లేద‌ని ప‌ద్మ చెప్పుకొచ్చింది.

వేణు మాధ‌వ్‌కి అవ‌కాశాలు ఇప్పించే స్థాయి ఉన్నా కూడా ఆయ‌న చేయ‌లేదు అని ప‌ద్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ప‌ద్మ చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.  ఇక వేణు మాధ‌వ్ విష‌యానికి వ‌స్తే.. కృష్ణ హీరోగా తెరకెక్కిన సంప్రదాయం అనే సినిమాతో కమెడియన్ గా మారిన వేణు మాధ‌వ్  రాజ‌కీయాల‌లో కూడా రాణించాల‌ని అనుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే కావాల‌న్న కోరికను నెరవేర్చుకోలేకపోయారు. వేణు మాధ‌వ్‌కి  డెంగ్యూ ఫీవర్ రాగా, ఆయ‌న దానికి  చికిత్స చేయించుకోకపోవడంతో ఊపిరితిత్తులు చెడిపోయి క‌న్నుమూసార‌ని ఆయ‌న త‌న‌యులు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...