Home Film News Neena Guptha: లిప్ కిస్ ఇచ్చాక డెటాల్ పోసుకొని నోరు క‌డుక్కున్నాన‌న్న న‌టి
Film News

Neena Guptha: లిప్ కిస్ ఇచ్చాక డెటాల్ పోసుకొని నోరు క‌డుక్కున్నాన‌న్న న‌టి

Neena Guptha: ఒక‌ప్పుడు సినిమాల‌లో రొమాన్స్ అనేది చాలా అరుదుగా క‌నిపించేది. కాని ఇప్పుడు అలా కాదు హీరోయిన్స్ ఒక‌వైపు అందాలు ఆర‌బోయ‌డం, మ‌రోవైపు బెడ్ రూం సీన్ల‌లో రెచ్చిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమాల‌తో పాటు పెద్ద సినిమాల‌లోను లిప్ కిస్‌లు కామ‌న్‌గా మారాయి. అయితే కొంద‌రికి ఇష్టం లేక‌పోయిన త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ల‌లో ముద్దులు పెట్టేందుకు సిద్ధం కావ‌ల‌సి వ‌స్తుంది. తాజాగా ల‌వ్ స్టోరీస్ 2 న‌టి ఒక  హీరోకి ముద్దు ఇచ్చిన తర్వాత.. తాను డెటాల్ తో నోరు కడుక్కున్నాను అంటూ సంచలన విషయాలు వెల్లడించి హాట్ టాపిక్‌గా నిలిచింది.

బాలీవుడ్ నటి నీనా గుప్తా బోల్డ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య యువతను ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఆమె తాజాగా  తొలి ముద్దు విషయాలను షేర్ చేసుకుంది. ఓ టీవీ సీరియ‌ల్ కోసం  బాలీవుడ్ నటుడు దిలీప్ ధావన్ తో కలిసి న‌టించింది నీనా. అయితే ఆ సీరియ‌ల్‌లో దిలీప్‌తో క‌లిసి ముద్దు సీన్ చేసింద‌ట‌. అస్స‌లు ముద్దు సీన్‌లో న‌టించ‌డం నాకు ఇష్టం లేదు, కాని షూటింగ్ కాబ‌ట్టి త‌ప్ప‌క ముద్దు సీన్ చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. తెలియ‌ని వ్య‌క్తికి ముద్దు పెట్ట‌డం చాలా క‌ష్ట‌మని చెప్పిన నీనా గుప్తా.. సీన్ అనంత‌రం త‌న నోరుని డెటాల్‌తో క‌డుక్కున్న‌ట్టు తెలియజేసింది.

నీనా గుప్తా రీసెంట్‌గా  లస్ట్ స్టోరీస్ 2 లో న‌టించ‌గా, ఇది  జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నీనా గుప్తా..హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా క‌నిపించింది.. “పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ కు వెళ్లండి” అన్న డైలాగ్ చెప్పి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది నీనా గుప్తా. అయితే దిలీప్‌తో ముద్దు పెట్టాక డెటాల్ తో నోరు కడుక్కుంది అనే విష‌యం అత‌నికి తెలిస్తే ఎంత ఫీల‌వుతాడో అని ఈమె కామెంట్స్‌కి నెటిజన్స్ ఫ‌న్నీగా స్పందిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...