Home Film News Ram Charan: వీడియో లీక్.. సంగీత్ ఫంక్ష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో స్టెప్పులేసిన శ‌ర్వానంద్, ర‌క్షిత్
Film News

Ram Charan: వీడియో లీక్.. సంగీత్ ఫంక్ష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో స్టెప్పులేసిన శ‌ర్వానంద్, ర‌క్షిత్

Ram Charan: టాలీవ‌డ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా యంగ్ అంగ్ ఎన‌ర్జిటిక్ హీరో శ‌ర్వానంద్ రక్షిత‌తో ఏడ‌డుగుల వేశాడు. వీరి పెళ్లి అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. గ‌త జనవరి నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం కాగా, శనివారం జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది. ఇక‌ నిన్న హల్దీ, సంగీత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు పలువురు ఈ వేడుకల్లో పాల్గొని సంద‌డి చేశారు.

సంగీత్‌ వేడుక సందర్భంగా శర్వానంద్‌, రక్షితలు త‌మ‌ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి తాజా హిట్టు చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని పాటకు వీరిద్దరూ డ్యాన్స్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది . ముఖ్యంగా శర్వానంద్ పెళ్లి వేడుకకి వ‌చ్చిన అమ్మాయిల‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ డాన్సులు వేసి దుమ్ము రేప‌డం ప్ర‌త్యేకంగా నిలిచింది. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూన‌కాలు లోడింగ్ అనే పాట‌కు శ‌ర్వానంద్ ,రామ్ చ‌ర‌ణ్ కలిసి చేసిన డ్యాన్స్ మాత్రం అభిమానులకి పిచ్చెక్కిస్తుంది. ప్ర‌స్తుతం సంగీత్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

 

రామ్‌ చరణ్‌, శర్వానంద్‌ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇక, శర్వానంద్‌ పెళ్లాడబోయే అమ్మాయి వివరాల విషయానికి వస్తే.. రక్షిత రెడ్డి ఏపీకి చెందిన పొలిటికల్ ఫ్యామిలీ నుండి వ‌చ్చింది.ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ కాగా, తాతయ్య బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రముఖ రాజకీయ నేత. శర్వానంద్‌, రక్షితరెడ్డిలు గత కొంత కాలం నుంచి ప్రేమించుకున్న నేప‌థ్యంలో పెద్ద‌లు ఇరువురి పెళ్లి ఘ‌నంగా జ‌రిపారు. యువీ క్రియేష‌న్స్‌కు చెందిన విక్ర‌మ్ కూడా ఈ వేడుక‌కి హాజ‌రై నూత‌న దంప‌తుల‌ని ఆశీర్వ‌దించారు. శర్వానంద్ విషయానికి వస్తే గత ఏడాది ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి హిట్ సాధించిన ఆయన .. ప్రస్తుతం తను శ్రీరామ్ ఆదిత్యతో ఓ చిత్రం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీకి
స్మాల్ గ్యాప్ ఇచ్చాడు.

 

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...