Home Film News Hyper Adi: అమ్మాయి వదిలేసిందని.. ఐదేళ్లుగా మందు తాగుతూనే ఉన్నా: హైపర్ ఆది
Film News

Hyper Adi: అమ్మాయి వదిలేసిందని.. ఐదేళ్లుగా మందు తాగుతూనే ఉన్నా: హైపర్ ఆది

Hyper Adi: తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యి ఎన్నో ఏళ్లు అయినా.. ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ లో వచ్చే ఆర్టిస్టులు ప్రేక్షకుల్ని నవ్విస్తునే ఉన్నారు. ఇక ఈ ప్రోగ్రామ్ లో హైపర్ ఆది అంటే తెలియని వారుండరు. చాలా వరకు హిట్ అయిన మూవీస్ ను స్పూఫ్ చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తుంటాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు ఢీ లాంటి డాన్స్ షోలోనూ టీమ్ లీడర్ గా ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్ టైమ్స్ లో అయితే సినిమాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకున్నాడు. అటు సిల్వర్ స్క్రీన్, ఇటు బుల్లితెరపై కూడా ఎక్కడా డ్రా బ్యాక్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా ఢీ స్టేజ్ పై ఓ మందు బాటిల్ తో సహా వచ్చి నానా రచ్చ చేశాడు.

నన్ను అమ్మాయి వదిలేసింది అందుకే ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యాను అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రోమో విషయానికి వస్తే.. దీపిక పిల్లి, అఖిల్ ను తీసుకుని స్టేజ్ పైకి తీసుకురాగా.. ప్రదీప్ ఎవడీడు అనేసరికి.. మా బావ అంటూ సమాధానం చెబుతుంది. వెంటనే శేఖర్ మాస్టర్ ఇంకొక ఆయన ఏడి అంటూ ఆదిని ఉద్దేశించి అడగ్గా.. వెంటనే స్టేజి పైకి హైపర్ ఆది ఆల్కహాల్ బాటిల్ తో ఎంట్రీ ఇచ్చారు.

ఇంతలో శేఖర్ మాస్టర్.. ఏంటి మందు బాటిల్ తో స్టేజ్ పైకి వస్తావా.. అంటూ శేఖర్ మాస్టర్ అనడంతో నీ ప్రాబ్లం ఏంటి.. అని అడుగుతారు ఆది. ఆ మాటతో శేఖర్ మాస్టర్ తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆది మాటలకు శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ తాగినట్టున్నాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే.. ఎవరికోయ్ ఫస్ట్ టైమ్ ఐదు సీజన్ల నుండి తాగాల్సి వస్తోంది ఆ గుట్టు తెలుసా.. నీకు తెలుసా.. అంటూ చాలా ఫన్నీగా రియాక్ట్ అవ్వడం అందరూ నవ్వుకున్నారు. ఇక దీపిక పిల్లిని నమ్ముకోవడంతో ఆమె తనను వదిలేసింది అన్నట్లుగా పరోక్షంగా కౌంటర్ వేశారు ఆది.. ప్రజంట్ ఆ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...