Home Film News Punch Prasad: సీరియ‌స్‌గా మారిన పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి.. ఇప్పుడు ఆయ‌న‌కి ఎలా ఉందంటే..!
Film News

Punch Prasad: సీరియ‌స్‌గా మారిన పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి.. ఇప్పుడు ఆయ‌న‌కి ఎలా ఉందంటే..!

Punch Prasad: బుల్లితెర‌పై లేదా వెండితెర‌పై మ‌న‌కు కామెడీ పంచే క‌మెడీయ‌న్స్ జీవితాల‌లో ఎన్నో విషాదాలు ఉంటాయి. వారి జీవితాల‌లో ఎన్నో క‌ష్టాలు ఉన్నా కూడా వారు పైకి న‌వ్వ‌తూ మ‌న‌ల్ని న‌వ్విస్తుంటారు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మ‌న‌ల్ని ఎంత‌గానో అల‌రిస్తున్న క‌మెడీయ‌న్ పంచ్ ప్ర‌సాద్. ఇత‌ను ప్ర‌స్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోను క‌నిపిస్తూ అల‌రిస్తూ ఉన్నాడు. అయితే  కొన్నాళ్లుగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుండ‌గా, నిత్యం ఆసుప‌త్రి చుట్టూ తిరుగుతూ రెగ్యులర్‌గా డ‌యాల‌సిస్ కూడా చేయించుకుంటున్నారు. తాజాగా ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్  త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ సాయం కావాల‌ని కోరాడు.

జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు పంచ్ ప్ర‌సాద్ గురించి  పెద్దగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్వించే ఇత‌ను శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోను త‌న‌దైన పంచ్‌లతో అల‌రిస్తూ ఉంటాడు.  అయితే గ‌త కొద్ది రోజులుగా పంచ్ ప్ర‌సాద్ అనారోగ్యంతో స‌త‌మతం అవుతున్నాడు. ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయిన‌ట్టు తెలుస్తుంది.  నిత్యం ఆయ‌న డ‌యాలిసిస్ చేయించుకోవ‌ల్సిన ప‌రిస్థితి.  అయితే ఆయ‌న‌ని ఓ వైపు కిడ్నీ సమస్య వేధిస్తుండగా.. తాజాగా కొత్త స‌మ‌స్య ఆయ‌న‌ని మ‌రింత వేధిస్తుంది.

ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడ‌ని అంటున్నారు..   అప్పట్లో నూకరాజు ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలియ‌జేశాడు. తాజాగా ఇమ్మాన్యుయేల్.. అన్నకు సీరియస్‌గా ఉందని చెబుతూ… ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారని అన్నాడు.  అయితే ఈ ఆప‌రేష‌న్ కోసం  చాలా ఖర్చు అవుతుంది. దాని కోసం మేమంతా మాకు తోచింది ట్రై చేస్తున్నాం. మీరు కూడా మీకు తోచినంత‌  సాయం చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్” అంటూ బ్యాంక్ వివరాలతో ఇమ్మూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే దీనిపై చాలా మంది ఆడియన్స్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ సాయం చేస్తామని  అంటున్నారు.కాగా, పంచ్ ప్ర‌సాద్ కిడ్నీ స‌మ‌స్య‌తో పాటు థైరాయిడ్ స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.ఆయ‌న త్వ‌ర‌గా కోలుకొని క్షేమంగా బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...