Home Film News Keerthi Suresh: కీర్తి సురేష్‌కి పెళ్లి ప్ర‌శ్న‌లు.. మ‌రోసారి త‌న పెళ్లిపై స్పందించిన క‌ళావ‌తి
Film News

Keerthi Suresh: కీర్తి సురేష్‌కి పెళ్లి ప్ర‌శ్న‌లు.. మ‌రోసారి త‌న పెళ్లిపై స్పందించిన క‌ళావ‌తి

Keerthi Suresh: మ‌హాన‌టి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మడి యాక్టింగ్ చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటుంది కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు ఒక‌వైపు హీరోయిన్‌గా న‌టిస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తుంది. అయితే కీర్తి సురేష్ చేస్తున్న ఈ రిస్క్ ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కి గురి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇటీవ‌ల తెగ వార్త‌లు హ‌ల్ చల్ చేస్తున్నాయి. ఓ బిజినెస్ మ్యాన్‌ని కీర్తి సురేష్ మ్యారేజ్ చేసుకోనుందంటూ బోలెడన్ని ప్ర‌చారాలు సాగాయి.. సరిగ్గా ఇదే సమయంలో ఓ కుర్రాడితో కలిసి కీర్తి కనిపించడం తో ఇక అత‌నే కీర్తికి కాబోయే వ‌రుడు అని జోస్యాలు చెప్పారు

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి పేరు ఫర్హాన్ అని, ఎప్పటినుంచి కీర్తి ఇతడితో లవ్ లో ఉందని  అనేక ర‌కాలుగా ముచ్చ‌టించుకున్నారు.కాని వాట‌న్నింటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇటీవ‌ల ద‌స‌రాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన కీర్తి సురేష్ తాజాగా ఉదయానిధి స్టాలిన్ తో మామన్నన్ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ మూవీ  ఆడియో లాంచ్ లోనూ కీర్తి సురేష్‌కి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.  ఆ స‌మ‌యంలో కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. ‘నా పెళ్లి వార్తలపై ఇప్పటికే ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు, నాకు అర్ధం కావ‌డం లేద‌ని కీర్తి పేర్కొంది.

నా వెడ్డింగ్ గురించి అంత ఆస‌క్తి ఎందుకు? ఒక‌వేళ నా పెళ్లకి సంబంధించి ఏదైన  ప్లానింగ్ జరిగితే నేనే స్వయంగా ప్రకటిస్తా. ప్రతి సారి ఇలా అడగాల్సిన అవసరం లేదు అంటూ కీర్తి పేర్కొంది.  కీర్తి న‌టిస్తున్న‌ ‘మామన్నన్’ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది.  మరోవైపు ఈ అమ్మ‌డు తెలుగులో ‘భోళా శంకర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం  ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఇందులో కీర్తి  చిరంజీవికి చెల్లెలి పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...