Home Film News Jailer Movie: బాబోయ్ జైల‌ర్ ప్రభంజ‌నం మాములుగా లేదు.. విక్ర‌మ్ రికార్డ్ సింపుల్‌గా ఊదేశాడే..!
Film News

Jailer Movie: బాబోయ్ జైల‌ర్ ప్రభంజ‌నం మాములుగా లేదు.. విక్ర‌మ్ రికార్డ్ సింపుల్‌గా ఊదేశాడే..!

Jailer Movie: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మానియా గురించి, ఆయ‌న రికార్డుల కోత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు పెద్ద హిట్ కొట్ట‌న‌క్క‌ర్లేదు. పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే చాలు రికార్డులు చెరిగిపోతుంటాయి.  తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో  సుధీర్ఘకాలంగా  సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్న ర‌జ‌నీకాంత్ గత కొన్నేళ్లుగా  వ‌రుస ఫ్లాపులు చ‌విచూస్తున్నాడు. ఈ స‌మ‌యంలో జైల‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, ఆగ‌స్ట్ 10న విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం అంత‌టా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తూ స‌త్తా చాటుతుంది.

క‌మ‌ల్ హాస‌న్-లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ అనే మూవీ గ‌త ఏడాది విడుద‌లై స‌త్తా చాటింది. ఈ చిత్రం   విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 410 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళ, తెలుగు భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా మంచి లాభాలు పంచింది. కమల్ హాసన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా,  ఈ  చిత్రానికి వచ్చిన లాభాలతో అప్పులన్నీ తీర్చేస్తానని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించడం విశేషం.  కాగా కమల్ విక్రమ్ లైఫ్ టైం రికార్డుని  రజినీకాంత్ జైల‌ర్ కేవ‌లం  6 రోజుల్లో అధిగమించింది.   జైలర్ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ. 416 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చిత్రం ఆగస్ట్ 15 వ రోజున భారీ ఆక్యూపెన్సి కనబర‌చ‌డంతో 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి సునాయాసంగా చేరినట్లు తెలుస్తోంది

ప్ర‌స్తుతం జైల‌ర్ చిత్రానికి పోటీగా మ‌రో పెద్ద సినిమా ఏది క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ మూవీ  మరో వారం స్ట్రాంగ్ రన్ కొనసాగేలా క‌నిపిస్తుంది. దీంతో  జైలర్ భారీ ఫిగర్ నమోదు చేసేలా ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. జైలర్ చిత్రంలో  మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేయడంతో అన్ని భాష‌ల‌లోను మూవీకి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది . రమ్య కృష్ణ, తమన్నా, సునీల్ కీలక రోల్స్ చేశారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ రజినీకాంత్ ప్రెజెన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను సూప‌ర్ హిట్ చేశాయి.  . నరసింహా, బాబా సినిమాల తర్వాత మళ్లీ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది ర‌మ్య‌కృష్ణ‌.  ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, యాక్షన్ డ్రామాగా  చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...