Home Film News Sangeetha: పెళ్లి జీవితం దుర్భ‌రం..భ‌ర్త‌ని వ‌దిలేద్దామ‌నుకున్నానంటూ సంగీత షాకింగ్ కామెంట్స్
Film News

Sangeetha: పెళ్లి జీవితం దుర్భ‌రం..భ‌ర్త‌ని వ‌దిలేద్దామ‌నుకున్నానంటూ సంగీత షాకింగ్ కామెంట్స్

Sangeetha: సెల‌బ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవ‌డ‌మే చాలా త‌క్కువ‌. చేసుకున్న వారిలో కొంద‌రు మ‌న్స‌ప‌ర్ధ‌ల వ‌ల‌న విడాకులు తీసుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలోనే ఎంత మంది విడాకులు తీసుకున్నారో మ‌నం చూశాం. అయితే తాజ‌గా ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్ సంగీత పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. `ఖడ్గం` సినిమాతో  ఫుల్ పాపుల‌ర్ అయిన సంగీత‌ ఆ సినిమా విజయంతో బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. అయితే  పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ భామ అప్పుడ‌ప్పుడు గెస్ట్ రోల్ లో మెరుస్తుంది. చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రంలో ఓ పాట‌లో మెరిసి అల‌రించింది. అయితే సంగీత త‌న పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

సంగీత 2009 లో కోలీవుడ్ సింగ‌ర్ అయిన క్రిష్ ని వివాహం చేసుకోగా,  వీరిది ప్రేమ వివాహం. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరార్ ఆలయంలో ఇద్ద‌రు పెళ్లి చేసుకోగా, ఆ త‌ర్వాత సంతోషంగా ఉన్నార‌ని అంద‌రు అనుకున్నారు. కాని పెళ్లి త‌ర్వాత దుర్భ‌ర జీవితం చూశానంటుంది సంగీత‌.   ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సంగీత.. వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించి షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. సంగీత‌-క్రిష్‌లు ప్రేమించుకోగా, పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. కాని అది కుద‌ర‌లేదు. దాంతో వారు వెళ్లి పెళ్లి చేసుకోగా, వివాహం అనంత‌రం వారికి ఫ్యామిలీ నుండి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. చాలా గొడ‌వ‌లు అయ్యాయ‌ట‌.

ఇరు కుటుంబాలు వారికి దూరం కావ‌డంతో  పెళ్లి జ‌రిగిన కొత్త‌లో త‌న‌ లైఫ్ చాలా దారుణంగా ఉండేద‌ని.. ల‌స‌లు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అన్న భావ‌న క‌లిగింద‌ని.. మ్యారేజ్‌ లైఫ్‌ని వదిలేయాలని  అని భావించాన‌ని సంగీత స్ప‌ష్టం చేసింది.మా ఇద్ద‌రి ఆలోచ‌న‌ల‌తో పాటు రంగాలు వేరు. మ‌న‌స్థ‌త్వం కూడా కాస్త భిన్నం. నాకు నచ్చేది ఆయ‌న‌కు న‌చ్చేది కాదు. ఆయ‌న‌కు న‌చ్చేది  నాకు న‌చ్చేది కాదు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఉండేది. అప్పుడు ఒక‌రినొక‌రం బాగా న‌మ్ముకుంటూ వ‌చ్చాము. అర్ధం చేసుకుంటూ వచ్చి ఒక్క తాటిపైనే నిల‌బ‌డ్డాం అని సంగీత స్ప‌ష్టం చేసింది. ఇక సంగీత‌-క్రిష్ దంప‌తుల‌కు 2012లో ఒక కూతురు జ‌న్మించ‌గా, ప్ర‌స్తుతం పాప‌తో ఈ దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...