Home Film News Comedian: క‌మెడీయ‌న్‌పై హీరో ఫ్యాన్స్ రాళ్ల దాడి..ప్రాణ భ‌యంతో బాత్‌రూంలో దాక్కున్నాడు.!
Film News

Comedian: క‌మెడీయ‌న్‌పై హీరో ఫ్యాన్స్ రాళ్ల దాడి..ప్రాణ భ‌యంతో బాత్‌రూంలో దాక్కున్నాడు.!

Comedian: తెలుగులో త‌న హాస్యంతో క‌డుపుబ్బ న‌వ్వించిన కమెడీయ‌న్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే పేరు బ్ర‌హ్మానందం. అలానే త‌మిళంలో త‌న‌దైన కామెడీతో హాస్యం పంచారు వ‌డివేలు. అయితే వ‌డివేలు ఎక్కువ‌గా వివాదాల‌లో ఇరుక్కోవ‌డం వ‌ల‌న ఆయ‌న కెరీర్ స‌జావుగా సాగ‌లేదు.  ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవ‌డం కారణంగా చాలా రోజులు ఆయన వెండితెరకి దూరం అయ్యారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తో స‌హా ఆయన‌కి వివాదాలు ఉన్నాయి. నోటి దురుసు తనం వల్ల చాలా సార్లు ఇండస్ట్రీ నుండి బ్యాన్ అయ్యే ప‌రిస్థితి వ‌ర‌కు కూడా వెళ్లారు. ప‌లువురు హీరోల‌పై, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై నోరు పారేసుకొని లేని పోని చిక్కుల్లో ప‌డ‌డం ఆయ‌న‌కి చాలా స‌ర‌దా.

ఓ సారి  అప్పటి స్టార్ హీరో విజయ్ కాంత్‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారు వ‌డివేలు. విజ‌య్‌కాంత్‌కి సినిమా ప‌రంగా, రాజ‌కీయప‌రంగా మంచి పేరు ఉంది. అలాంటి వ్య‌క్తిని   రాజకీయలకు ఎలాంటి సంబంధం లేని కమెడియన్ వడివేలు దారుణ‌మైన మాట అన్నాడు. విజయకాంత్ ని రాజకీయాల్లో లేకుండా చేయడమే నా కోరిక అని చెప్పి లేని పోని స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్నాడు. వడివేలు మాట‌ల‌కి ఆగ్ర‌హంతో ఊగిపోయిన అభిమానులు.. సరాసరి వడివేలు  ఇంటికి వెళ్లి ఆయ‌న ఇంటిపై  రాళ్ల వ‌ర్షం కురిపించార‌ట‌. ఆ దాడిలో వ‌డివేలు తృటిలో త‌ప్పించుకున్నాడు.  ప్రాణ భయంతో బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నారట.

లేదంటే ఆ రోజు విజ‌య్ కాంత్ అభిమానుల చేతుల్లో వ‌డివేలు బ‌ల‌య్యేవార‌ని చెబుతుంటారు. వ‌డివేలు  ఈ వివాదమే కాదు  చాలా మంది హీరోయిన్లు, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌ల ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్ చిత్రంతో వడివేలు సాలిడ్ రీ ఎంట్రీ ఇవ్వ‌గా, ఇందులో  హీరో తండ్రిగా, ఎమ్మెల్యేగా వడివేలు నటన సూప‌ర్బ్ అనే చెప్పాలి. ఎక్కువ‌గా కామెడీ పండించే వడివేలు ఇందులో  ఎమోషనల్ గా నటించి అదరగొట్టారు.  రీసెంట్‌గా వ‌డివేలు గురించి ష‌కీలా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. వడివేలు గురించి బయట నెగిటివ్ గా చెబితే దారుణ‌మైన నెగెటివ్ కాల్స్ వ‌చ్చేవని పేర్కొంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...