Home Film News Varun Tej: ఫారెన్‌లో మెరిసిన లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్.. ఇది చూసి అంతా షాక్..!
Film News

Varun Tej: ఫారెన్‌లో మెరిసిన లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్.. ఇది చూసి అంతా షాక్..!

Varun Tej: టాలీవుడ్‌లో స‌మంత‌, నాగ చైత‌న్య జంట త‌ర్వాత మ‌ళ్లీ అంత క్రేజ్ దక్కించుకున్న జంట వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి. ఐదేళ్ల‌కి పైగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. ఇక ఏడాది చివ‌రిలో మంచి ముహూర్తం చూసుకొని ఒక్క‌టి కానున్నారు. అయితే వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వీరికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వీరిద్దరి పెళ్లి ఎక్కడ చేయ‌నున్నారు? పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లి కార్డు ఖరీదు ఎంత? వంటి అంశాలపై అనేక‌ వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వ‌రుణ్ తొలిసారి సోషల్ మీడియాలో లావ‌ణ్య‌తో ట్రిప‌క్‌కి సంబంధించిన ఫొటోను షేర్ చేసుకున్నాడు

ఫారెన్‌లో లావణ్య త్రిపాఠి తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న స్టిల్‌ను వరుణ్‌ తేజ్‌ షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుండగా.. ఇద్దరు హాలీడే స్పాట్‌కు ఎక్కడికెళ్లారనే దానిపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే మ‌రి కొంద‌రు ఈ పిక్ ఎంగేజ్‌మెంట్‌కి ముందు వెకేష‌న్ వెళ్లిన పిక్ అని అంటున్నారు. ఏదేమైన ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక పెళ్లికి ముందు లావ‌ణ్య త్రిపాఠి… వ‌రుణ్ తేజ్‌కి ఓ కండీష‌న్ పెట్టిందని సమాచారం.

లావణ్య త్రిపాఠికి భరత నాట్యం అంటే చాలా ఇష్టం కాగా, పెళ్లయిన తర్వాత తనకు ఏదైనా వేదికపై భరతనాట్యం చేసే అవకాశం వస్తే దానికి అడ్డు చెప్పొద్దని, భరత నాట్యం చేసే ఛాన్స్ అస్స‌లు తాను వదులుకోలేనని చెప్పిందట. ఇక తనకి ఇష్టమైన డాన్స్ విషయంలో ఎలాంటి కండిషన్ పెట్టకూడదని కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల లావ‌ణ్య త్రిపాఠి నుండి పెద్ద‌గా సినిమాలేవి రావ‌డం లేదు. వరుణ్‌ తేజ్ మాత్రం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. అలానే డెబ్యూ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు పలాస ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో కూడా సినిమా చేయ‌నున్నాడు.

 

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...