Home Special Looks పాపులర్ యాంకర్ & నటి అనితా చౌదరి ఇప్పుడేమైపోయారు?
Special Looks

పాపులర్ యాంకర్ & నటి అనితా చౌదరి ఇప్పుడేమైపోయారు?

Celebrity Anchor Anitha Chowdary

అనితా చౌదరి చాలా కాలం క్రితం ఒక సెలబ్రిటీ యాంకర్. ఆమె చేసిన షో లకి అప్పట్లో మంచి టీఆర్పి రేటింగ్స్ వచ్చేవి. గళగళా మాట్లాడగలిగే అనితా చౌదరి అంతలా ఫేమస్ అవడానికి తన అందం కూడా ప్రధాన కారణం. తన అందమే తనకి కొన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఛత్రపతి సినిమాలో అనితా చౌదరి ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆమె అందులో సూరీడు అనే పిల్లోడికి అంధురాలైన అమ్మలా నటిస్తుంది. ‘సూరీడు.. సూరీడు..’ అంటూ తన కొడుకు గురించి అందరినీ అడుగుతూ ఉండే తన నటన తెలుగు వాళ్ళందరినీ బాగా ఆకట్టుకుంది. పెద్ద హిట్టయిన ఛత్రపతి సినిమాలో ఇది ఎంతో ఎమోషనల్ సీన్.

ఐతే, అలాంటి అనితా చౌదరి తర్వాత తెలుగు ప్రజలకి మళ్ళీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆమె గతంలో టీవీ యాంకర్ గా చేసిన ప్రోగ్రామ్స్ ని కూడా గుర్తు తెచ్చుకుందాం. అప్పట్లో జెమిని టీవీలో రఘు కూడా ఒక మంచి యాంకర్. ఆయనతో కలిసి అనిత పోస్ట్ బాక్స్ నంబర్ 1562 అనే ప్రోగ్రామ్ చేసారు. ఆడియన్స్ రాసిన ఉత్తరాలకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్తూ నడిచే ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. నిజానికి అనితా చౌదరి చాలా చిన్న వయసులోనే టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇటువైపు వచ్చే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళే.

అనితా చౌదరి కొన్ని సీరియల్స్ కూడా నటించారు. ఆమె చేసిన సినిమాల్లో నువ్వే నువ్వే, సంతోషం, మురారి, ఉయ్యాలా జంపాలా వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా ఎన్నో చిన్న చిన్న సినిమాలతో కూడా కలుపుకుని మొత్తం 100 సినిమాల్లో నటించారు. అనితా చౌదరి ఒక ఎన్నారైని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లి అవడం ఇండస్ట్రీకి దూరం అవడానికి ప్రధాన కారణం అయిందని చెప్పచ్చు. ఒక కొడుకు కూడా పుట్టడంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. సామాజిక భాద్యతగా ఆమె ఒక చారిటీ సంస్థని కూడా నడుపుతున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన ఆమె మంచి పాత్ర దొరికితే ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తానని చెప్తున్నారు. Let us wish her the best in life.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...