Home Special Looks త్రిష తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Special Looks

త్రిష తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Lovely Trisha First Remuneration

వరుస హిట్లతో దాదాపు ప్రతి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించిన అందాల భామ త్రిష. చెన్నైలో పుట్టిన త్రిషకి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ వైపు ఆసక్తి ఉంది. అందుకే తన చదువు మధ్యలో ఉండగానే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అందులో పెద్దగా అవకాశం ఏమీ రాకపోవడంతో మెల్లగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. త్రిషాకి అలా నటనపై కూడా ఆసక్తి రావడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేసింది. మొదట్లో ఎన్నో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేసిన త్రిష కి ఆ అవకాశాలు బాగానే ఉపయోగపడ్డాయి అని చెప్పుకోవాలి.

‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఆ తర్వాత ఒక పెద్ద సినిమా ఐన ‘వర్షం’లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఐతే, ఆ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిషకి ఫాన్స్ అయిపోయిన వాళ్ళల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉన్నారు. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది అందులో. ఇక అక్కడినుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోని త్రిష నిదానంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతూ వచ్చింది.

ఐతే, అందరూ పోరాడినట్లే త్రిష కూడా తన తొలి రోజుల్లో చాలా కష్టపడింది. అవకాశాలని దక్కించుకోవడం కోసం చిన్న చిన్న పాత్రల్లో నటించే ప్రయత్నంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ కూడా తీసుకునేదట. కేవలం 500 రూపాయలు తీసుకుని తన మొదటి ప్రాజెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అదే త్రిష ఒక్క సినిమాకి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. ‘కట్టా మీటా’ సినిమాతో అక్షయ్ కుమార్ తో జత కట్టి బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన త్రిష స్టార్ స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. తన నాజూకుతనంతో యువకులకి, వృద్ధులకి తేడా లేకుండా పిచ్చెక్కించే త్రిష ఒకప్పుడు అంత తక్కువ డబ్బు తీసుకుని ఒక సినిమాలో పనిచేసింది అంటే నమ్మడం కచ్చితంగా కష్టమే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...