Home Special Looks మెగాస్టార్ నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ : కానీ రిలీజ్ కాలేదు ఎందుకు?
Special Looks

మెగాస్టార్ నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ : కానీ రిలీజ్ కాలేదు ఎందుకు?

Chiranjeevi Was About To Hollywood With This Movie

చిరంజీవి గురించి తెలుగువాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే మొత్తం దక్షిణ భారతానికి ఆయన పేరు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఇక్కడి ప్రజలకు తన నటన ద్వారా, డాన్స్ ద్వారా, ఇంకా వ్యక్తిత్వం ద్వారా కూడా చిరంజీవి ప్రజలకు దగ్గర అయ్యారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న సంధర్భంలో ప్రయత్నించిన ఒక సినిమా విఫలం అవడంతో మళ్ళీ ఆయన అటువైపు చూడలేదు. నిజానికి ఆయనకి తెలుగు ప్రజలని ఎంటర్టైన్ చేయడానికే టైమ్ సరిపోలేదు. అంతలా ఇక్కడ బిజీ అయిపోవడం జరిగినది. కానీ ఆయన సినిమాలు అడపా దడపా హిందీలోకి డబ్ అవుతూనే ఉన్నాయి. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చిరంజీవి హాలీవుడ్ కి కూడా వెళ్ళే ప్రయత్నం చేసారని. ఐనా, మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కొన్ని సినిమాలు ఎంతో టాక్ తెచ్చుకుని కూడా రిలీజ్ అవకుండా ఆగిపోతూ ఉంటాయి. అలాగే ఆ హాలీవుడ్ కి చెందిన మూవీ విషయంలోనూ జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.

ఇంతకీ చిరంజీవి ప్లాన్ చేసిన ఆ హాలీవుడ్ ఏంటని అనుకుంటున్నారా? ఆ మూవీ మరేదో కాదు.. ఇప్పటికీ ఆ టైటిల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. అదే ‘అబు..’. బాగ్దాద్ గజదొంగ అనేది సబ్ టైటిల్. ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ రోజుల్లోనే 50 కోట్లు పెట్టి సినిమా ప్లాన్ చేసారంటే.. చిరంజీవి స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. 50 కోట్లతో సినిమా చేస్తే ఇప్పుడు కూడా ఒక పెద్ద సినిమాగానే కన్సిడర్ చేస్తారు. ఐతే, ఆ మూవీ స్టోరీ ఒక అంతర్జాతీయ స్టోరీ. ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ మూవీతో రిలేట్ అయ్యేట్టు ప్లాన్ చేశారు. హాలీవుడ్ నుండి కొంతమంది ప్రముఖ టెక్నీషియన్స్ కూడా ఈ మూవీ కోసం పనిచేయడానికి ఒప్పుకున్నారంటే కచ్చితంగా సాధారణ విషయం కాదు. చిరంజీవికి ఉన్న పొటెన్షియల్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారనే చెప్పాలి.

ఇప్పుడు.. ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందో చూద్దాం. కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్టు ఈ సినిమా ఆగిపోవడానికి కూడా ఇలా చాలా కారణాలే ఉన్నాయని చెప్తుంటారు. ముఖ్యంగా.. ఈ మూవీ అరబిక్ నేపథ్యంలో వస్తుంది కాబట్టి కథను చెప్పే ప్రయత్నంలో ఖురాన్ గురించి చూపించాల్సిన అవసరం వచ్చిందట. ఐతే, ఖురాన్ ఎంతో ప్రాచీనమైనది అని చెప్పే ప్రయత్నంలో దానిని ఒక బురద గుంట లోంచి తీసినట్టు చూపడంతో అక్కడివాళ్ళు విపరీతంగా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారట. ఇస్లాం ని అనుసరించే వాలా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సీన్ వల్ల మూవీ టీం పై సౌదీ అరేబియాలో కేస్ నమోదయ్యిందట. అలా అప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. అంతే కాకుండా, ఆ రోజుల్లో భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కావడం.. తొలిసారి హాలీవుడ్ కి కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం వంటివి ఒకవేళ వికటిస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆలోచనతో నిర్మాతలు కూడా ఎలాగూ వేగంగా ముందుకు కదలటం లేదని ఈ ప్రాజెక్ట్ ని ఆపేసారట.

చిరంజీవి ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లు చెప్తారు. అప్పటిదాకా తెలుగు వాళ్ళ నుండి ఎనలేని స్టార్ డం ని ఎంజాయ్ చేసిన చిరు.. దానిని ఖండాంతరాలకు విస్తరించాలని అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగా జరగనప్పటికీ చిరంజీవి చాలాకాలం పాటు ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఉండిపోయారట. అంతలా ఆయన్ని ఈ మూవీ ఆలోచన ప్రభావితం చేయటంతో.. కొడుకుగా రామ్ చరణ్ తన తండ్రి కళని సాకారం చేసే ప్రయత్నం చేశారట. కానీ చిరంజీవికి వయసు పెరిగిపోవటంతో ఇప్పుడు ఆ పాత్ర పోషించడం కాస్త కష్టంతో కూడుకున్నది అనుకుని మెల్లగా ఆ మూవీ ఆలోచనల్లోంచి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ మూవీ ఎలాంటి ఆటంకాలకు నోచుకోకుండా.. నిర్విరామంగా ముందుకు వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదో అన్న చాలామంది ఊహలకి ఒక క్లారిటీ వచ్చి ఉండేది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

33 సంవత్సరాల నాగార్జున శివ సినిమా వెనక ఎవరూ ఊహించని స్టోరీ ఇదే..!

అక్కినేని నాగార్జున కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలలో శివ సినిమా కూడా ఒకటి… సెన్సేషనల్...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. సూపర్ స్టార్ మహేష్ కి ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా..!

ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో.. ఆంధ్రాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే మారుమ్రోగిపోతుంది...

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...