Home Film News రామ్ సినిమాలో కనిపించబోతున్న వంటలక్క!
Film News

రామ్ సినిమాలో కనిపించబోతున్న వంటలక్క!

Vantalakka To Appear In Ram Film

వంటలక్క ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తుకువచ్చే సీరియల్ ‘కార్తీక దీపం’. ముఖ్యంగా ఈ సీరియల్ ద్వారా దీప క్యారెక్టర్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ చూడటానికి ఎన్నో ఇళ్ళల్లో అందరూ పనులు ముగించుకుని టీవీల ముందు కూర్చుంటారంటే నమ్మకుండా ఉండలేం. అంతలా ఈ సీరియల్ అభిమానులని సంపాదించుకుంది. ఇప్పటిదాకా 1100 పైనే ఎపిసోడ్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ నటులకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇందులో హీరోయిన్ గా ఆక్ట్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్ ని పోషించింది. ఆమె బ్రాండ్ వాల్యూ తెలిసిన రామ్ పోతినేని 19 వ సినిమా టీం ప్రేమి ని సంప్రదించారంట. ఆ సినిమాలో పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత దీప.. సారీ.. ప్రేమి ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరింత అధికారిక సమాచారం తెలియాల్సి ఉన్నా.. ఇప్పుడిప్పుడే షూటింగ్ మొదలు పెట్టుకున్న రామ్ మూవీ రోజలు గడిచే కొద్దీ ఈ విషయాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

ఐతే, ఈ వార్తా తెలిసినప్పటినుంచి ఆమె అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీరియల్ లో తమని అలరించిన దీప వెండితెర మీద ఎలా కనిపిస్తుందోనని చూడాలి అనుకుంటున్నారు. కానీ.. రామ్ తీయబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఇంకా సమాచారం అందలేదు. అది ఒకవేళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే దీపని ఇష్టపడేవాళ్ళంతా ఫ్యామిలీస్ కాబట్టి.. వాళ్ళు ఈ మూవీపై కూడా ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మొత్తానికి బుల్లితెరపై నుంచి వెండి తెర మీదకు వస్తున్న ప్రేమి విశ్వనాథ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అండాలి అంటే ఇంకొంతకాలం ఎదురుచూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...