Home Special Looks శృతి హాసన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్!
Special Looks

శృతి హాసన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్!

కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి హాసన్ చాలా తొందరగానే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిందని చెప్పచ్చు. తమిళ నాడుకి చెందిన అమ్మాయి అయినా అక్కడ రాణించడంతో పాటు ఇక్కడ కూడా మంచి గుర్తింపుని సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి కూడా వెళ్ళింది అనుకోండి. కానీ, శృతి హాసన్ కి ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు రావాడం లేదు. ఒక్కసారిగా వచ్చిన స్టార్ డం ని అలా ఎంజాయ్ చేస్తూ కొన్ని మంచి అవకాశాల్ని కూడా వదులుకుంది అని చెప్తారు. అవేంటో ఒకసారి చూద్దాం..

— బిజినెస్ మ్యాన్

పూరీ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన సంగతి మనకి తెలిసిందే. ఐతే, ఈ అవకాశం మొదటగా శృతి కే వెళ్ళిందట. కారణం ఏమిటో తెలీదు కానీ శృతి హాసన్ ఈ మూవీ చేయడానికి ఒప్పుకోలేదట.

— జెర్సీ

సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాని ఈ మూవీతో నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ మూవీలో హీరోయిన గా చేయడానికి శృతిని సంప్రదిస్తే తను చేయడానికి ఓకే చెప్పలేదట.

— అమర్ అక్బర్ ఆంటోనీ

రవితేజ, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోనూ శృతికి ఛాన్స్ ఇచ్చారట. కానీ తను ఒప్పుకోలేదు.

— దువ్వాడ జగన్నాథం

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముందు శృతినే అప్రోచ్ అయినా తను ఒప్పుకోకపోవడంతో తర్వాత పూజాని అడిగారట. అంతకు ముందు అల్లు అర్జున్ తో కలిసి రేసుగుర్రం చేసినప్పటికీ ఈ మూవీకి శృతి ఒప్పుకోలేదు.

— రెబెల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన రెబెల్ మూవీలో కూడా ముందుగా శృతినే అనుకున్నప్పటికీ.. ఆమె యెస్ చెప్పకపోవడంతో మిల్కీ బ్యూటీని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఐతే, ఇలా జరగడానికి కారణం శృతి లవ్ లో పడటమే అని అనుకుంటున్నారు ఆమె ఫాన్స్. శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ అనే వ్యక్తిని ఘాడంగా ప్రేమించింది. అతనితో రిలేషన్ లో ఉన్న శృతి ఇప్పటికే అతనితో వైఫ్ లాగా మెలిగిపోతుంది. ఈ తొందరలో తను ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వదిలేసుకుందేమిటి అని ఆమె అభిమానులు వాపోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...

చెవిటి, మూగ అయినా అందం ‘అభినయం’ ఆమెని ఆపలేదు..

ఆమెకి చెవులు వినిపించవు. మాట్లాడటం కూడా రాదు. కానీ, తెలుగు తమిళ రెండు భాషల్లోనూ చాలా...