Home Film News ‘మేజర్’ మాస్టర్ పీస్.. నో రేటింగ్.. మస్ట్ వాచ్..
Film NewsReviews

‘మేజర్’ మాస్టర్ పీస్.. నో రేటింగ్.. మస్ట్ వాచ్..

MAJOR Movie Review
MAJOR Movie Review

26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేయగా.. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ్ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.

‘మేజర్’ సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్‌లోనూ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం అడివి శేష్ తను చెయ్యాల్సిన దాని కన్నా ఎక్కువ చేసాడు. సినిమా అంటే తనకు ఎంత ప్యాషన్ అనేది ‘మేజర్’ తో మరోసారి ప్రూవ్ చేశాడు.

ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా ఉండం, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడం, విడుదలకు కొద్దిరోజుల ముందు నుండే ప్రీమియర్స్ వెయ్యడంతో ‘మేజర్’ కి మంచి బజ్‌తో పాటే పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేశారు. అక్కడ 88 లొకేషన్లలో ప్రీమియర్స్ పడగా.. అన్ని చోట్లా టికెట్స్ Sold Out కావడం విశేషం.

ఇక ఆర్మీ సోల్జర్స్‌కి, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి సినిమా చూపించగా వారి స్పందన ఎలా ఉందనేది శేష్ మాటల్లో విన్నాం.. ఆ ఆనందాన్ని అతని కళ్లల్లో చూశాం.. ‘మేజర్’ ప్రకటించినప్పటినుంది సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను పలుమార్లు కలిసాడు శేష్. మూవీ చూశాక వారి స్పందన మాటల్లో చెప్పలేం. ఈ శుక్రవారం తెలుగు, హిందీతో పాటు మలయాళంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మేజర్’ చూసిన వాళ్లంతా యునానిమస్‌గా ‘మేజర్ మాస్టర్ పీస్’ అంటున్నారు. మీడియా వారైతే ‘నో రేటింగ్.. మస్ట్ వాచ్’ అంటూ ఇంత చక్కటి సినిమాకి రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వలేం అనేశారంటే సినిమా స్థాయి ఏంటనేది అర్థమవుతోంది.

కథ విషయానికొస్తే..
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సందీప్ ఉన్నికృష్ణన్.. చిన్నప్పటి నుండి ఇండియన్ ఆర్మీలో పని చెయ్యాలని తపన పడుతుంటాడు. కానీ అతని తండ్రి (ప్రకాష్ రాజ్) కి కొడుకుని డాక్టర్ చెయ్యాలని, తల్లి (రేవతి) కి ఇంజనీరింగ్ చదివించాలని ఉంటుంది. నానా తంటాలు పడి సందీప్ వాళ్లని ఒప్పించి ఆర్మీలో జాయిన్ అవుతాడు. స్కూల్ డేస్‌లో ఇష్టపడ్డ ఇషా (సయీ మంజ్రేకర్) ని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోవడం కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. దీంతో విడాకుల వరకు వెళ్తారు.

ఫ్యామిలీ కంటే దేశమే ముఖ్యమనుకునే సందీప్ ఇండియన్ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగి.. భారత సైన్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఎన్ఎస్‌జీ కమాండోస్‌కి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. ఓసారి తను లీవ్ తీసుకుని ఇంటికి వెళుతుండగా.. ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేశారని తెలిసి, ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని.. 51 ఎన్ఎస్‌జీ టీంతో కలిసి ముంబై వెళ్తాడు. తాజ్ హోటల్‌పై దాడి చేసిన ఉగ్రమూకను సందీప్ ఎలా అంతం చేశాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా సేవ్ చేసాడు? దేశం కోసం ఎలా ప్రాణ త్యాగం చేసాడు అనేది మిగతా కథ..

నటీనటులు..
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి డిఫరెంట్ ఫిలింస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేష్.. ‘మేజర్’ లో సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌లో నటించాడు అనడం కంటే జీవించాడని చెప్పడం బెటర్.. ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. ముఖ్యంగా ఎమోషన్స్ క్యారీ చేస్తూనే స్క్రీన్ మీద హీరోయిజాన్ని చూపించాడు. నిజమైన సోల్జర్‌లా తనని తాను మార్చుకోవడానికి శేష్ పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. శేష్, సయీ మంజ్రేకర్‌ల పెయిర్, కెమిస్ట్రీ బాగుంది. తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుందామె. తాజ్ హోటల్‌లో చిక్కుకున్న చిన్నారిని కాపాడే హైదరాబాద్ యువతి ప్రమోద రెడ్డిగా (శోభిత ధూళిపాళ) నటన బాగుంది. ప్రకాష్ రాజ్ ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేసేస్తారనే సంగతి తెలిసిందే. సందీప్ తండ్రి పాత్రలో మరోసారి అలరించారు. తల్లిగా రేవతి చక్కగా చేశారు.

టెక్నికల్ టీం..
బయోపిక్ అంటే డైరెక్టర్‌కి చాలా పెద్ద ఛాలెంజ్.. స్క్రిప్ట్ దగ్గరి నుండే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే డాక్యుమెంటరీ అంటారు. సినిమాటిక్ లిబర్టీస్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అసలుకే ఎసరొస్తుంది. అదే స్టోరీలోని సోల్ మిస్ కాకుండా తెరకెక్కిస్తే ఆడియన్స్ ఆదరిస్తారనే విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఈ విషయంలో శశి కిరణ్ సక్సెస్ అయ్యాడు. సందీప్ బాల్యం, ప్రేమ, ఆర్మీలో చేరడం నుండి చాలా విషయాలు ఎవరికీ తెలియనివి చూపించాడు.

మరో హైలెట్ శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. వంశీ పచ్చిపులుసు విజువల్స్ ‘మేజర్’ కి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.

ఓవరాల్‌గా..
‘మేజర్’ దేశం మీద భక్తిభావంతో మనమందరం చూడాల్సిన సినిమా..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...