Home Film News Tamannaah: అంత దారుణమైన సీన్స్‌లో న‌టించ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన త‌మ‌న్నా
Film News

Tamannaah: అంత దారుణమైన సీన్స్‌లో న‌టించ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన త‌మ‌న్నా

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అందంతో పాటు న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకున్న త‌మ‌న్నా ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది. ఇందులో ఈ అమ్మ‌డి అందాల ర‌చ్చ‌కి అంద‌రు షాక‌వుతున్నారు. ఒకప్పుడు ముద్దుకే ఎస్ చెప్ప‌ని త‌మ‌న్నా ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి మ‌రి న‌టిస్తుంది. ఇటీవ‌ల ఈ అమ్మడు లవ్ మేకింగ్ సీన్స్ తో కూడిన  హాట్ హాట్ వెబ్ సీరిస్ చేసింది. అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన  ‘జీ కర్దా‘ అనే వెబ్ సిరీస్‌లో త‌మ‌న్నా కీ రోల్ చేసింది. ఈ వెబ్ సిరీస్ రెండు రోజుల నుండి స్ట్రీమ్ అవుతుండ‌గా, ఇందులో త‌మ‌న్నా హాట్ షో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆమెని ప‌లువురు తిట్టిపోస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా వాటిపై స్పందించింది.  నేను ఇంత రెచ్చిపోవ‌డానికి కార‌ణం ..కథకు ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా అవసరం అనిపించింది. రిలేష‌న్ షిప్‌ని వాస్త‌వంగా చూపించాల‌నే ఉద్దేశంతో అలాంటి సీన్స్ లో న‌టించాను. అయితే ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన‌, జ‌నాలు యాక్సెప్ట్ చేయ‌క‌పోయిన కూడా క‌థ కోసం అలాంటివి చూపిస్తారు. డైరెక్టర్ అరుణిమ ఇచ్చిన మాకు ఎంత‌గానో ఉప‌యోగప‌డ్డాయి. సౌక‌ర్య‌వంతంగా కొన్ని స‌న్నివేశాల‌లో న‌టించాము అని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది. ఈ మిల్కీ భామ త్వ‌ర‌లో  ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే మరో బోల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు రాబోతుంది . ఇందులో త‌న ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి న‌టించింది. ఇందులో ఇంకా ఏ రేంజ్‌లో స‌న్నివేశాలు ఉంటాయో చూడాలి.

స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న‌ త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లు దాటి పోయింది. ఇన్నేళ్ల‌ తన కెరీర్ లో  50కి పైగా సినిమాల్లో న‌టించిన ఈ భామ‌… తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతుంది.  ప్ర‌స్తుతం  ఈ అమ్మ‌డు ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ చిత్రంతో పాటు  చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న భోళా శంక‌ర్  సినిమా ఆగస్టు11న విడుదలవ్వడానికి రెడీ అవుతోంది. ఇక ఈ అమ్మ‌డు విజ‌య్ వ‌ర్మ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌గా, త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...