Home Film News Amitabh Bachchan: అభిమానుల ద‌గ్గ‌ర‌కు వెళ్లేట‌ప్పుడు చెప్పులు వేసుకోని అమితాబ్.. కార‌ణం ఏంటంటే..!
Film News

Amitabh Bachchan: అభిమానుల ద‌గ్గ‌ర‌కు వెళ్లేట‌ప్పుడు చెప్పులు వేసుకోని అమితాబ్.. కార‌ణం ఏంటంటే..!

Amitabh Bachchan: బాలీవుడ్‌ దిగ్గజం, లెజండ‌రీ న‌టుఉ.. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగా అశేష అభిమాన‌గ‌ణం ఉంది. వారిని ఎక్కువ‌గా ప్రేమిస్తుంటారు బిగ్ బీ. అమితాబ్ సినిమాల‌న్నా, ఆయ‌న చేసే షోలన్నా కూడా కొంద‌రు చాలా ఇష్ట‌ప‌డుతుంతారు. ఇక‌ అమితాబ్ ను కనీసం ఒక్కసారైనా చూడాలని ఫ్యాన్స్ ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే అమితాబ్‌ బచ్చన్‌ పలకరింపు కోసం ప్రతీ ఆదివారం ముంబయిలోని ఆయన స్వగృహం జల్సా వద్దకి వేలాది మంది అభిమానులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఆ స‌మ‌యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ తన ఇంటి బాల్కనీలోకి వచ్చి అక్కడ కొద్ది సేపు నిల్చొని అభిమానులకు అభివాదం చేసి లోప‌లికి వెళ్లి పోతారు.

జల్సా వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటూ, వారితో కాసేపు మాట్లాడి ఆనంద‌పరిచే అమితాబ్ వారి దగ్గరకి వెళ్లే ట‌ప్పుడు మాత్రం కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తారు. ఇలా ఎందుకు వెళ‌తార‌ని చాలా మంది ప్ర‌శ్నించ‌డంతో రీసెంట్‌గా దీనిపై క్లారిటీ ఇచ్చాడు బిగ్ బీ. ఎవరైనా గుడికి వెళ్తే చెప్పులు లేకుండా వెళ్తారు. తన అభిమానులు కూడా తనకు దేవుళ్లతో సమానం అందుకే వారిని కలిసేటపుడు చెప్పులు వ‌దిలేసి వెళ‌తాన‌ని అన్నారు. ఒకవేళ తాను ఆదివారం అందుబాటులో ఉండకపోతే రెండ్రోజుల ముందే చెబుతాన‌ని అన్నారు బిగ్ బీ. ఈ సాంప్రదాయాన్ని దాదాపు 50 ఏళ్లుగా ఇలాగే కొనసాగిస్తున్నానని తెలియ‌జేశారు.

 

ఇక తనకోసం ఎంతో దూరం నుండి వ‌చ్చి ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్న అభిమానుల దాహ‌ర్తి తీర్చడం కోసం అక్కడ ఒక నాలుగు మంచి నీళ్ల ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారట అమితాబ్. అందుకే ఆయన్ను అభిమానులు అంతగా ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ వ‌య‌స్సులోను అమితాబ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప‌లు సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రోవైపు ప‌లు హిందీ సినిమాల‌లో కూడా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల ఆయ‌న మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. దీంతో కొద్దిరోజులు ఇంటి వద్దే చికిత్స తీసుకొని ఇప్పుడు సెక్షన్‌ 84 చిత్రీకరణలోకూడా పాల్గొంటున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...