Home Film News Murali Mohan: శ్రీదేవి.. ముర‌ళీ మోహ‌న్ భార్య కావ‌ల్సిందా.. ఎలా మిస్ అయింది..!
Film News

Murali Mohan: శ్రీదేవి.. ముర‌ళీ మోహ‌న్ భార్య కావ‌ల్సిందా.. ఎలా మిస్ అయింది..!

Murali Mohan: ఇండియ‌న్ సినీ ప్రేమికుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీదేవి. ఆమె అందం, న‌ట‌న‌ని ఎవ‌రు అంత ఈజీగా మ‌ర‌చిపోతారు. అనుకోని పరిస్థితుల వ‌ల‌న శ్రీదేవి క‌న్నుమూసిన ఆమె జ్ఞాపకాలు ఇప్ప‌టికీ అంద‌రి మ‌దిలో మెదులుతూనే ఉంటాయి. శ్రీదేవికి కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల‌లో విప‌రీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ‌రోవైపు ఆమెకి సంబంధించి అనేక ప్ర‌చారాలు కూడా నిత్యం నెట్టింట హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. అప్ప‌ట్లో శ్రీదేవి.. హీరో మిథున్ చక్రవర్తిని ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.క‌ట్ చేస్తే ఆమె బోని క‌పూర్‌ని పెళ్లి చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చింది. అయితే శ్రీదేవి కెరీర్ బిగినింగ్ లో ఆమె త‌ల్లి నటుడు మురళీమోహన్ కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

పాత త‌రం న‌టుల‌లో ఒక‌రైన ముర‌ళీ మోహ‌న్ వెండితెర‌పై ఎన్నో చిత్రాల‌లో హీరోగా న‌టించి మెప్పించారు. ఆయ‌న కేవ‌లం హీరోగా మాత్ర‌మే కాకుండా నిర్మాత‌గాను రాణించారు. మ‌రోవైపు జయభేరి గ్రూపు అధిపతిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అనంత‌రం రాజ‌కీయాల‌లో కూడా త‌న స‌త్తా చూపించారు. వివాదాల‌కి చాలా దూరంగా ఉండే ముర‌ళీ మోహ‌న్ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాకు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రితో కూడా ప్రేమ వ్య‌వ‌హారాలు లేవు. అండర్ హ్యాండ్ డీలింగ్స్ అస‌లే లేవు. నిజ జీవితంలో నా క్యారెక్టర్ గురించి తెలిసిన నాగేశ్వరరావు మా సినిమా ప‌రిశ్ర‌మలో శ్రీరామ చంద్రుడు ఎవరైనా ఉన్నారు అంటే.. ఒక్క మురళీ మోహన్ మాత్రమే అని సర్టిఫికెట్ ఇచ్చారు.. అప్ప‌టి నుండి నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను’ అని అన్నారు ముర‌ళీ మోహ‌న్.

 

శ్రీదేవితో మీ పెళ్లి అంటూ అప్ప‌ట్లో అనేక ప్ర‌చారాలు సాగాయి. దానిపై మీ స్పంద‌న ఏంట‌ని యాంకర్ ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన ముర‌ళీ మోహ‌న్..శ్రీదేవి త‌ల్లికి నేను అంటే ప్ర‌త్యేక గౌర‌వం ఉడేది. కుర్రాడు బాగున్నాడు, బుద్ది మంతుడు, ఎలాంటి చెడు అల‌వాట్లు లేవు అని భావించారు. ఆమెని నాకిచ్చి పెళ్లి చేస్తే బాగుండేది అని అప్ప‌ట్లో అనుకున్నారు త‌ప్ప మరొక‌టి లేదు. సెల‌బ్రిటీల‌కి సంబంధించిన చిన్న విష‌యాలని కూడా పెద్ద‌ది చేసి చూడ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. 84 ఏళ్ల వ‌య‌స్సులో ఇప్ప‌టికీ నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ప్ర‌తి విష‌యం ప‌ట్ల పాజిటివ్‌గా ఆలోచించ‌డ‌మే అని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. ఎంత ప్ర‌శాంతంగా ఉంటే అంత ఆరోగ్యం బాగుంటుంద‌ని ముర‌ళీమోహ‌న్ అన్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...