Home Film News యంగ్ టైగర్ మరో అరుదైన ఘనత.. సౌత్ లోనే మొదటి హీరో..!
Film News

యంగ్ టైగర్ మరో అరుదైన ఘనత.. సౌత్ లోనే మొదటి హీరో..!

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ.. తనలోని మైనస్లను కూడా ప్లస్సులుగా మార్చుకుంటూ ..అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే ఆయన నటించిన ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు ఎంతమంది జనాభ వచ్చారో మనం చూసిందే.

Ntr: మరో ఘనత సాధించిన ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ నుంచి ఏకైక హీరో.. | ntr has  been featured in the top 50 asian stars of 2023

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ హీరోగా మారిపోయిన ఎన్టీఆర్.. తెలుగులో ఏ హీరో అందుకొని అరుదైన ఘనతను అందుకున్నాడు . త్రిబుల్ ఆర్‌’తో తెలుగు సినిమాకి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ చిత్రం హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు పొందటంతో పాటు.. ‘నాటు నాటు’ పాటకి గాను ఆస్కార్ కూడా గెలిచింది.

‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పటికే ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌ లిస్ట్ లో స్థానం సంపాదించి ఎన్టీఆర్, చరణ్ అరుదైన గౌరవం పొందారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను సాధించాడు.ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ “గ్లోబల్ మీడియాలో 500 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు” పేరుతో ఒక లిస్టును విడుదల చేసింది.

Hanu on X: "VARIETY మ్యాగజైన్ - ప్రపంచం లో 500 మంది అత్యంత ప్రభావశీల  వ్యక్తుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరారు. 🙏 PRIDE OF INDIAN PEOPLE 🇮🇳  @tarak9999 🇮🇳 PROUD OF YOU ANNA ...

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఎన్టీఆర్ స్థానం సంపాదించుకున్నాడు . సౌత్ నుంచి ఈ లిస్టులో స్థానం సంపాదించిన మొదటి హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. త్రిబుల్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జడ్ స్పీడ్ లో జరుగుతుంది. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. అయితే ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...