Home Film News Venu Swamy: త్వ‌ర‌లోనే ఇద్ద‌రు హీరోలు మ‌ర‌ణిస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వేణుస్వామి
Film News

Venu Swamy: త్వ‌ర‌లోనే ఇద్ద‌రు హీరోలు మ‌ర‌ణిస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వేణుస్వామి

Venu Swamy: వేణు స్వామి.. ఇటీవ‌లి కాలంలో ఈ పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. ప్ర‌ముఖుల జాత‌కాలు చెబుతూ వార్త‌ల‌లో నిలుస్తున్న వేణు స్వామి కొద్ది సంవ‌త్స‌రాల క్రితం నాగ చైత‌న్య‌- స‌మంత విడిపోతార‌ని చెప్పాడు. ఆయ‌న చెప్పినట్టుగానే పెళ్లైన కొద్ది నెల‌ల‌కు స‌మంత‌-చై విడాకులు తీసుకున్నారు. వేణు స్వామి చెప్పింది జ‌రిగింది కాబ‌ట్టి ఇప్పుడు ఆయ‌న చెబుతున్న జాతకాల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. నేష‌న‌ల్ క్ర‌ష్  రష్మిక మందాన  వేణు స్వామికి ప్రియ శిష్యురాలు అన్న సంగ‌తి తెలిసిందే. రష్మిక త‌ర‌చుగా  వేణు స్వామితో ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకుంటుంది.. ఇక వేణు స్వామి మాట‌లు వినే రష్మిక త‌న నిశ్చితార్థం అయ్యాక .. రక్షిత్ శెట్టికి  బ్రేకప్ చెప్పింది.

ఇటీవ‌ల నిథి అగర్వాల్ కూడా వేణుస్వామి శిష్యురాలిగా మారిపోయింది. ఆయ‌న‌తో త‌న ఇంట్లో పూజ‌లు చేయించుకుంది. ఇలా సెల‌బ్రిటీలు అంద‌రు ఇప్పుడు ఆయ‌న ఇంట్లో క్యూ క‌డుతున్నారు. కొద్ది రోజుల క్రితం వేణు స్వామి ఓ యంగ్ హీరో మ‌ర‌ణిస్తాడ‌ని  చెప్పుకొచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే తార‌క‌ర‌త్న మ‌ర‌ణించాడ‌ని భావించారు.  రీసెంట్‌గా  వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో  సంచలనంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో మరో ఇద్దరు హీరోలు 2026 లో చనిపోతారని , అందులో ఒకరు అనారోగ్యంతో మరొకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటారని ఆయ‌న పేర్కొన్నారు. వేణు స్వామి కామెంట్స్ తో అభిమానుల‌లో ద‌డ మొద‌లైంది.

వేణు స్వామి ఆ హీరోల పేర్లు చెప్పలేదు కానీ కానీ మిధున రాశి, వృశ్చిక రాశి అయిన స్టార్ హీరోలకు ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చారు..  2026 లోపు ఇద్దరు హీరోలు మరణిస్తారని నేను ఎప్పుడో చెప్పాను.. నేను చెప్పినవి చాలా వరకు జరిగాయి. కొంద‌రు అవగాహన లేని వారు మాత్రమే సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఏపీ రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడిన వేణు స్వామి.. . పార్టీల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి జగన్ సీఎం కావ‌డం ఖాయమని స్పష్టం చేసారు. వైఎస్‌ జగన్ తొలి స్థానంలో ఉంటార‌ని, చంద్రబాబు రెండో స్థానంలో, పవన్ కల్యాణ్ మూడో స్థానంలో ఉంటారని ఆయ‌న జోస్యం చెప్పారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...