Home Film News Chiru: త‌న త‌ర్వాతి సినిమాలో మ‌రో హీరోని తీసుకోబోతున్న చిరు.. సింగిల్‌గా హ్యాండిల్ చేయ‌లేవా?
Film News

Chiru: త‌న త‌ర్వాతి సినిమాలో మ‌రో హీరోని తీసుకోబోతున్న చిరు.. సింగిల్‌గా హ్యాండిల్ చేయ‌లేవా?

Chiru: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిభ గురించి, ఆయ‌న సినిమాలు సాధించిన హిట్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సిల్వర్ స్క్రీన్ ని ఏలుతున్న రోజుల్లో చిరంజీవి త‌న స‌త్తా చాటి మెగాస్టార్‌గా ఎదిగాడు. త‌న డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించి ద‌శాబ్ధాల పాటు చిత్ర సీమ‌ని ఏలారు. ఆయ‌న‌ని స్పూర్తిగా తీసుకొని ప‌రిశ్ర‌మ‌లోకి చాలా మంది వ‌చ్చారు. అయితే ఇప్ప‌టికీ కుర్ర  హీరోల‌తో పోటీ ప‌డి సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. కాని ఆ సినిమాల‌న్నీ నెగెటివ్ టాక్ ద‌క్కించుకుంటున్నాయి. లెజెండరీ హీరో కెరీర్ చరమాంకంలో చేస్తున్న సినిమాలు అభిమానులని అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. అదీ కాక ఆయ‌న ప్ర‌తి సినిమాలోను ఓ హీరో పైన ఆధారప‌డాల్సి వ‌స్తుంది.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆచార్య మూవీలో కొడుకు రామ్ చరణ్ సపోర్ట్ తీసుకున్నాడు మెగాస్టార్. ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించిన కూడా ఆ చిత్రం పెద్ద విజ‌యం అందించ‌లేక‌పోయింది. ఇక బాబీ తెర‌కెక్కించిన  వాల్తేరు వీరయ్యలో రవితేజ త‌న‌వంతు సహకారం అందించాడు.   సెకండ్ హాఫ్ కి రవితేజ పాత్ర ఊపిరిపోయ‌గా, సినిమా మంచి విజ‌యం సాధించింది..  ఇక భోళా శంక‌ర్ చిత్రంలో కూడా అక్కినేని హీరో సుశాంత్ స‌పోర్ట్ తీసుకున్నాడు. ఈ రోజు భోళా శంక‌ర్ విడుదల కాగా,ఈ చిత్రం నెగెటివ్ టాక్ ద‌క్కించుకుంది. ఇక చిరు త్వ‌ర‌లో  దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో  శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇవి చూస్తుంటే అభిమానుల‌కి కొత్త అనుమానాలు త‌లెత్తుతున్నాయి. స్టార్ హీరో అయిన  చిరంజీవికి కూడా సపోర్ట్ కావాల్సిందేనేమో అనిపిస్తుంది. చిరు కూడా వెంకటేష్, నాగార్జునల బాటలో ప‌య‌నిస్తున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది.. రానున్న రోజుల‌లో చిరు నుండి ఎక్కువ‌గా మల్టీస్టారర్స్  వ‌స్తాయ‌ని అంటున్నారు. అయితే భోళా శంక‌ర్‌లో చిరంజీవి.. ప‌వ‌న్‌ని ఇమిటేట్ చేయ‌డం కొంద‌రికి న‌చ్చితే మ‌ర కొంద‌రు మాత్రం త‌న‌ని తాను త‌గ్గించుకున్నాడిని అంటున్నారు.  శ్రీముఖి లాంటి ఒక యాంకర్ తో ఖుషి నడుము చూసే సీన్‌ స్పూఫ్ చేయాల్సిన దుస్థితి చిరంజీవికి  రావ‌డ‌మేంట‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక  దేశంలో కథలు, రచయితలే లేనట్లు వరుస పెట్టి రీమేక్స్ చేస్తుండ‌డం కూడా ఎవ‌రికి న‌చ్చ‌డం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...