Home Film News Rashi Khanna: ఆ వ్య‌క్తితోనే రాశీ ఖ‌న్నా పెళ్లి.. త్వ‌ర‌లోనే మోగ‌నున్న పెళ్లి బాజాలు..!
Film News

Rashi Khanna: ఆ వ్య‌క్తితోనే రాశీ ఖ‌న్నా పెళ్లి.. త్వ‌ర‌లోనే మోగ‌నున్న పెళ్లి బాజాలు..!

Rashi Khanna: ఈ మ‌ధ్య కాలంలో ఇండ‌స్ట్రీకి చెందిన అందాల భామ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే వారు వివాహం చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే ఇందులో కొంద‌రు భామ‌లు పెళ్లి త‌ర్వాత కెరీర్‌ని కొన‌సాగిస్తున్నా కొంద‌రు మాత్రం సైలెంట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఊహల గుసగుసలాడే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నా  తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రి లో స‌త్తా చాటుతుంది. క్యూట్ లుక్స్‌తో పాటు ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేస్తున్న రాశీ సోష‌ల్ మీడియాలో కూడా గ్లామ‌ర్ షోతో నానా ర‌చ్చ చేస్తుంది.

అయితే రాశీ ఖ‌న్నాకి ఇప్పుడు పెళ్లి టైం వచ్చిన‌ట్టు తెలుస్తుంది. తాను కూడ త్వ‌ర‌లోనే ఓ వ్య‌క్తిని వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తాను ఒకప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను. అత‌నికి బ్రేకప్ చెప్ప‌డం వ‌ల‌న  డిప్రెషన్ లోకి వెళ్లడంతో చాలా బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల త‌ర్వాత  మరో వ్యక్తి పరిచయం కాగా, ఆ   వ్యక్తి కారణంగా  లావు తగ్గానని  పేర్కొంది.  తనను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొర‌క‌డంతో బరువు తగ్గానని, స్లిమ్ అయ్యానని  చెప్పుకొచ్చిన రాశీ ఖ‌న్నా సంతోషంగా ఉన్న‌ట్టు కూడా పేర్కొంది. అయితే కొన్నాళ్లుగా అతనితో డేటింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన రాశీ ఖ‌న్నా అత‌నితో పెళ్లికి కూడా సిద్ధ‌మైంద‌ట‌.

ఇటీల త‌మ ప్రేమ విష‌యం ఇంట్లో చెప్పడంతో వారు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తుంది. త్వ‌రలోనే తాను డేటింగ్ చేస్తున్న వ్య‌క్తితో రాశీ ఖ‌న్నా ఏడ‌డుగులు వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక   సినిమాల విషయానికి వస్తే…  రాశీ ఖ‌న్నా నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ సినిమాలు గత ఏడాది విడుదల అయి డిజాస్ట‌ర్ అయ్యాయి . ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్ట‌డంతో రాశీ ఖన్నాకి ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. ఇక ఇప్పుడు  తమిళం, హిందీలో ఆమె సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం కొత్త చిత్రాలకి సైన్ చేయ‌లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...