Home Film News వీళ్లిద్దరికీ కలిసి రాని టైటిల్ ఏంటో తెలుసా?
Film News

వీళ్లిద్దరికీ కలిసి రాని టైటిల్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రీ స్టార్ డా. రాజ శేఖర్ మధ్య ఏవో గొడవలున్నాయని గతంలో కొన్నిసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. చిరు పార్టీ పెట్టినప్పుడు.. వేరే పార్టీలో ఉన్న జీవిత, రాజ శేఖర్ ఆయన మీద కామెంట్స్ చేస్తే, ఫ్యాన్స్ వారి మీద దాడి చెయ్యడం.. తర్వాత స్వయంగా చిరంజీవే,రాజ శేఖర్ ఇంటికి వెళ్లి సారీ చెప్పడం, తను నటించిన సత్యయేవ జయతే సినిమాలో చిరు మీద ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేస్తే, ఫ్యాన్స్ థియేటర్లలో గొడవలు చెయ్యడం..

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో చిరు మీద ఫైర్ అవుతూ.. రాజ శేఖర్ తన పదవికి రాజీనామా చెయ్యడం.. లాంటి సంఘటనలు మనం చూసాం.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటుంటారు. అవసరాన్ని బట్టి ఎప్పుడు, ఎలా, ఎవరి సాయం అవసరమవుతుందో తెలీదు.. అందుకే ఏదైనా ఒక మాట అనే ముందు.. ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి..

గతంలో చిరు, రాజ శేఖర్ మధ్య మంచి రిలేషన్ ఉండేది. పొలిటికల్ ఎంట్రీ తర్వాతే పర్సనల్ టార్గెట్ ఎక్కువైంది. సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటుంటారు.. లోపల ఎన్ని ఉన్నా పైకి ఏమీ లేనట్టే ఉండాలి.. కలిసి పని చెయ్యాలి కాబట్టి కాస్త టైం పట్టినా కలిసిపోవాలి.. స్నేహంకోసం సినిమాలో విజయ్ కుమార్ చేసిన క్యారెక్టర్ మొదట రాజ శేఖరే చెయ్యాల్సిందంట.. అప్పటినుండే ఇద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయ్యిందని టాక్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. చిరు, రాజ శేఖర్ కలిసున్న రేర్ అండ్ త్రో బ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దాని గురించి చెప్పడానికన్న మాట..

చిరు, రాజ శేఖర్ హీరోలుగా యాక్ట్ చేసిన ఓ సినిమాకి సంబంధించిన కామం ఫ్యాక్టర్ ఒకటుంది.. అదేంటంటే.. ఇద్దరూ ”మెకానిక్” అనే పదం వచ్చే టైటిల్ తో సినిమాలు చేసారు.

నటసామ్రాట్ ఏఎన్నార్, చిరంజీవి, విజయ శాంతి కాంబినేషన్ లో.. బి. గోపాల్ డైరెక్షన్లో.. గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించిన యాక్షన్, కామెడీ ఫిల్మ్.. ”మెకానిక్ అల్లుడు”.. రాజ్ – కోటి కంపోజ్ చేసిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కానీ.. 1993 , మే 27 న భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేకపోయింది..

రాజ శేఖర్, రంభ జంటగా.. ఎస్. వి. రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో.. రామోజీ రావు నిర్మించిన సినిమా.. ”మెకానిక్ మావయ్య”.. 1999 లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ బరిలో బొక్కబోర్లా పడింది.. ఆ రకంగా.. మెగాస్టార్‌కి ”మెకానిక్ అల్లుడు”, యాంగ్రీ స్టార్‌కి ”మెకానిక్ మావయ్య”.. ఇలా ”మెకానిక్” టైటిల్ కలిసి రాలేదన్న మాట.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...