Home Film News షారుఖ్ పక్కన సమంత! రణ్‌వీర్‌ని ఎక్కడ కలిసిందంటే..
Film News

షారుఖ్ పక్కన సమంత! రణ్‌వీర్‌ని ఎక్కడ కలిసిందంటే..

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాలా రోజుల నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమ ఫేవరెట్ హీరోకి హిట్ ఎప్పుడు పడుతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ‘పఠాన్’ మూవీలో నటిస్తున్నాడు. దీపిక పదుకోణ్ కథానాయిక.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాకి ‘జవాన్’ అనే టైటిల్ కన్ఫమ్ చేస్తూ వీడియో రిలీజ్ చేస్తే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. షారుఖ్ డిఫరెంట్‌గా కనిపించడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో సౌత్ స్టార్ నయనతార హీరోయిన్ అని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి.

అయితే నయన్, ప్రియుడితో పెళ్లికి రెడీ అవడంతో ఆమె ప్లేస్‌లో సౌత్ క్వీన్ సమంతను తీసుకోబోతున్నారని, లేదు.. ఇప్పటికే ఆమెని ఫిక్స్ చేశారు కానీ తనే తప్పుకుంది అని కూడా అంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా, సామ్, నయన్ మీరోయిన్లుగా నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal) రీసెంట్‌గా రిలీజ్ అయింది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది సామ్. హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఓ హాలీవుడ్ మూవీ కూడా కమిట్ అయ్యింది.

షారుఖ్ సినిమాలో చేస్తుందా లేదా అనే విషయం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ఇదిలా ఉంటే సామ్ రీసెంట్‌గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. యూనిఫాం లాంటి కాస్ట్యూమ్‌లో తన ఒరిజినల్ నేమ్ ఉన్న బ్యాడ్జ్‌తో కనిపించింది. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లో రణ్‌వీర్‌ని కలిసుంటుందని, అలాగే ఆమె ‘సమ్‌థింగ్ బ్యూటిఫుల్ ఆన్ ది హోరిజోన్’ అంటూ షేర్ చేసిన పిక్ ఆ షూటింగ్ లొకేషన్‌ లోదే అయింటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

శ్రీరెడ్డిని కాదనుకున్న.. ఆ విషయంలో మాత్రం అలాంటి భార్యనే తెచ్చుకున్నాడుగా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు.. దివంగత...

33 సంవత్సరాల నాగార్జున శివ సినిమా వెనక ఎవరూ ఊహించని స్టోరీ ఇదే..!

అక్కినేని నాగార్జున కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలలో శివ సినిమా కూడా ఒకటి… సెన్సేషనల్...

హాయ్ నాన్న మూవీ రివ్యూ…ఈ ఏడాదిలోనే బెస్ట్ సినిమా ఇదే..!

టైటిల్‌: హాయ్ నాన్న‌ నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌,...

ఆ సినిమా కారణంగానే నా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్‌..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన శ్రీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో...