Home Special Looks నవ్వులు పంచే షో కి యాంకరింగ్ చేసే రష్మి జీవితంలో ఎంతో విషాదం!
Special Looks

నవ్వులు పంచే షో కి యాంకరింగ్ చేసే రష్మి జీవితంలో ఎంతో విషాదం!

Jabaradasth Anchor Rashmi Gets Emotional About Her Past

జబర్దస్త్. ఈ షో గురించి మనలో తెలియని వాళ్ళు పెద్దగా ఎవ్వరూ ఉండరు. ఈ షో ఎంతో మందికి తెలుగు రాష్ట్రాలలో ఆనందాన్ని పంచుతుంది. ఇందులో స్కిట్స్ చేసే వాళ్ళతో పాటు.. అక్కడ కూర్చునే జడ్జ్ లు.. అలాగే వాళ్ళకన్నా ముందు యాంకర్ మనకు ఎక్కువ గుర్తు ఉంటారు. జబర్దస్త్ కి యాంకర్ లుగా ఇప్పటికీ ఎక్కువగా చేస్తూ వచ్చింది ఇద్దరే ఇద్దరు. వాళ్ళే ఒకరు అనసూయ మరొకరు రష్మి. వీళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాలామంది ఫాన్స్ ఉన్నారు.

ఐతే, ఈ ఇద్దరికీ షో బాగా నడిపిస్తున్న పేరు ఉంది. బాగా మాట్లాడటం, స్కిట్స్ లో భాగంగా వాళ్లమీద జోకులు వేసినా పెద్దగా పట్టించుకోకుండా ఉండటం, నవ్వడం, నవ్వించడం. అలాగే వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ అందంతో ప్రేక్షకులని కట్టిపడేయడం గురించి మనకు తెలిసిందే. ఐతే అలా పనిచేస్తున్న రష్మి జీవితంలో మనం చూడని.. కాదు.. కనిపించని దుఖం ఉంది అంటే నమ్మటం కాస్త కష్టమే. ఈ మధ్య వచ్చిన వేరొక షో కి గెస్ట్ గా వెళ్ళిన రష్మి ఒక సందర్భంలో తన కుటుంబం గురించి మాట్లాడింది.

రష్మి సహజంగా చాలా చాలా చిన్న చిన్న విషయాల గురించి బాధపడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో సున్నితమైన విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా అలా కుక్కలు వంటి జంతువులు గాయపడినా వాటికోసం తపించి పోయే మనస్తత్వం రష్మిది. అలాంటి రష్మిని ఒక పెద్ద ఘటనే బాధపెట్టింది. తన జీవితంలో ఇప్పటిదాకా ఆ ఘటన ఎంత బాధపెట్టి ఉంటుందో కాస్త ఊహించడం కష్టమే. విషయం ఏమిటంటే.. రష్మి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని, అలాగే తనతో పాటు పుట్టిన వాళ్ళని అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడట. అప్పటినుంచి వాళ్ళ అమ్మ ఒక్కతే తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచింది అని చెప్పుకొచ్చింది. ఇలా చెప్పే ప్రయత్నంలో రష్మి చాలా ఎమోషనల్ అయింది. ఇద్దరు ఆడ, మగ మధ్య సరయిన బంధం లేకపోతే పిల్లలని కనకండి అని ఉపదేశం ఇచ్చింది. మీ పాటికి మీరు పిల్లల్ని కనేసి వదిలేస్తే వాళ్ళు ఎంత నరకం చూడాల్సి వస్తుందో ఆలోచించమని ఏడ్చేసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...