Home Film News Rajiv-Suma: విడాకుల వార్త‌ల‌పై మ‌రోసారి స్పందించిన రాజీవ్ క‌న‌కాల.. పిల్లలు చాల స‌ఫ‌ర్ అయ్యారు..
Film News

Rajiv-Suma: విడాకుల వార్త‌ల‌పై మ‌రోసారి స్పందించిన రాజీవ్ క‌న‌కాల.. పిల్లలు చాల స‌ఫ‌ర్ అయ్యారు..

Rajiv-Suma: ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడాకులకి సంబంధించిన వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత చాలా మంది జంటలు త‌మ రిలేష‌న్‌కి బ్రేక‌ప్ చెప్పుకున్నారు. రీసెంట్‌గా నిహారిక కూడా త‌న వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్ట‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే కొన్నాళ్లుగా సుమ‌- రాజీవ్ క‌న‌కాల విడాకుల‌పై అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. వారిద్ద‌రు విడిపోయార‌ని, దూరంగా ఉంటున్నార‌ని ఇలా ఏవేవో ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై ప‌లుసార్లు క్లారిటీ ఇచ్చిన కూడా అవి ఆగ‌డం లేదు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో రాజీవ్ క‌న‌కాల త‌న విడాకుల అంశంపై చాలా ఎమోష‌న‌ల్‌గా స్పందించారు.

“సుమ – నేను విడాకులు తీసుకున్నామ‌నే  వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. అలాంటివేమి లేవ‌ని చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు.  మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు ఇలాంటి త‌ప్పుడు ప్రచారాలు జరిగి ఉంటే వారు ఎంతో బాధ‌ప‌డేవారు. మాకు ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో. సాధార‌ణంగా ఇలాంటి వార్తలను సుమ పెద్దగా పట్టించుకోదు .. కాని నేను మాత్రం అంత  తేలికగా  తీసుకోలేను. ఈ విడాకుల విషయంపై స్కూల్లో పిల్లలు కూడా  కాస్త ఇబ్బంది పడ్డారు” అని రాజీవ్ అన్నాడు. స్కూల్‌లో వాళ్లకు ఎదురయ్యే ప్రశ్నల వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఒక్కరు ఆలోచించాలి. క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి వార్తలురావడం బాధేస్తోందన్నారు.

సుమతో నేను  విడిపోలేదు, ఇద్ద‌రం కలిసే ఉన్నామని చెప్పడం కోసం, ఆమె షోస్ కి కూడా  నేను వెళ్లాను .. తన ఈవెంట్స్ లో పాల్గొన్నాను. ఇటీవల యూఎస్ వెళ్లినప్పుడు ఇద్దం  ‘రీల్స్’ చేశాము. ఆ రీల్ కూడా  బాగా వైరల్ అయింది కూడా. ఇలా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం ప్ర‌తిసారి మాకు కష్టమైపోతోంది” అని  చెప్పుకొచ్చారు రాజీవ్ క‌న‌కాల‌. ఈ సారి చాలా గ‌ట్టిగా రాజీవ్ తమ విడాకుల‌పై స్పందించ‌గా, ఇప్పటికైన ఆ పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డుతుందో లేదో చూడాలి. సుమ  ప్ర‌స్తుతం యాంక‌రింగ్ లో స్టార్ డమ్ తో దూసుకుపోయింది. రాజీవ్ క‌న‌కాల న‌టుడిగా ప‌లు సినిమాల‌లో మెప్పిస్తూ ఉన్నారు. త్వ‌ర‌లో వీరు త‌మ కొడుకుని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...