Home Film News Bunny: పుష్ప‌రాజ్‌కి టీడీపీ నేత స్పెష‌ల్ పార్టీ.. రాయ‌ల‌సీమ రుచులకి బ‌న్నీ ఫిదా..!
Film News

Bunny: పుష్ప‌రాజ్‌కి టీడీపీ నేత స్పెష‌ల్ పార్టీ.. రాయ‌ల‌సీమ రుచులకి బ‌న్నీ ఫిదా..!

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతోనే బన్నీ క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది. ఇప్పుడు పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప 2 చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తే బ‌న్నీ హ‌వా మాములుగా ఉండ‌దు. ఈ ఏడాది చివ‌ర‌లో పుష్ప‌2 రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. తాజాగా ఆయ‌న తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఫామ్ హౌస్ లో మెర‌వ‌గా, ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్ గా  మారింది. బ‌న్నీకి స‌ద‌రు టీడీపీ నేత ప‌సందైన రాయ‌ల‌సీమ వంట‌కాల‌తో విందు ఏర్పాటు చేయ‌గా, వాటికి బ‌న్నీ ఫిదా అయ్యాడ‌ట‌.

బ‌న్నీ హైద‌రాబాద్ నుండి బెంగ‌ళూరుకి  వెళుతున్న స‌మ‌యంలో మార్గ మ‌ధ్య‌లో గార్లదిన్నె మండలం కనుంపల్లిలో ఆగారు.  అనంతపురం జిల్లా టిడిపి నాయకులు ఆయ‌న‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి , ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి బ‌న్నీకి స్వాగతం ప‌లికి వారి ఫామ్ హౌజ్‌కి తీసుకెళ్లారు. విందు తర్వాత   ఫామ్ హౌస్ బయట బన్నీ వారంద‌రితో క‌లిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.  అనంత‌రం అక్కడి నుంచి అల్లు అర్జున్ బయలుదేరి బెంగుళూరు వెళ్ళిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం బన్నీకి సంబంధించిన పిక్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్ర‌స్తుతం పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇందులో డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా కోసం  గత మూడేళ్ళుగా లాంగ్ హెయిర్ తోనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ హెయిర్ మరింత పొడవుగా క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న లుక్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఇటీవ‌ల అల్లు అర్జున్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో క‌లిసి మ‌రో పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేసిన విష‌యం విదిత‌మే.  మహాభారతంలో రెండు కీలక పర్వాల ఆధారంగా త్రివిక్రమ్ హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...