Home Film News Rajendra Prasad-Venkatesh: రాజేంద్ర ప్ర‌సాద్‌కి వెంక‌టేష్‌తో గొడ‌వ‌.. ఎందుకు జ‌రిగింది అంటే..!
Film News

Rajendra Prasad-Venkatesh: రాజేంద్ర ప్ర‌సాద్‌కి వెంక‌టేష్‌తో గొడ‌వ‌.. ఎందుకు జ‌రిగింది అంటే..!

Rajendra Prasad-Venkatesh: సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి వారు ఇప్ప‌టికీ హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాని ఆ నాటి కొంద‌రు హీరోలు ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. అయితే ఆ కాలంలో ఎక్కువ‌గా కామెడీ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్ర‌సాద్. ఆయ‌న సినిమాలు మొత్తం కూడా కామెడీ అనే ఒక అస్త్రాన్ని నమ్ముకొని ముందుకు దూసుకెళ్తు ఉండేవి. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రు కూడా రాజేంద్ర ప్ర‌సాద్ సినిమాల కోసం థియేట‌ర్స్‌కి క్యూ క‌ట్టేవారు. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ మంచి సినిమాలు చేసి చాలా మంది ఆడియన్స్ కి ఒక రిలీఫ్ ని ఇచ్చే వారు.

అయితే రాజేంద్ర ప్ర‌సాద్ సినిమాలు ఒక వ‌ర్గానికి కాకుండా అంద‌రికి న‌చ్చేవి. ఆ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కి మిగతా హీరోలతో కొన్ని గొడవలు అయ్యాయి అని చాలా మంది చెప్పుకొచ్చేవారు. అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదు అని కూడా కొంద‌రు అంటుంటారు. అయితే వెంక‌టేష్ తో రాజేంద్ర ప్ర‌సాద్‌కి గొడ‌వ అయింద‌ని, కొట్టుకున్నారు అని కూడా ప్ర‌చారం చేశారు. అస‌లు ఈ న్యూస్ కూడా ఎందుకు వచ్చింది అని ఎవ‌రికి అర్ధం కాలేదు. ఒక సినిమా విషయం లో వెంకటేష్ తో గొడవ పెట్టుకున్నారు అని చెప్పారు కానీ వీళ్లిద్దరూ కలిసి ఎఫ్‌2లో న‌టించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ సాధించింది.

 

వెంకటేష్ , రాజేంద్ర ప్ర‌సాద్ కలిసి ఎఫ్ 3 అనే చిత్రం కూడా చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండ‌గా, ఎవ‌రో కావాల‌ని వారిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు వెంక‌టేష్ ఎక్కువ‌గా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి. ఇక రాజేంద్రప్రసాద్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ అదరగొడుతున్నాడు ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్ప‌టికీ ఆయన కామెడీ టైమింగ్ లో ఏ మాత్రం కూడా పస తగ్గలేదు అనే చెప్పాలి… ఇండ‌స్ట్రీలో ఉండే లెజెండ్స్ లో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఒక‌రు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...