Home Film News Vassishta : ‘బింబిసార’ డైరెక్టర్ ఎవరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
Film News

Vassishta : ‘బింబిసార’ డైరెక్టర్ ఎవరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!

Vassishta
Vassishta

Vassishta: ‘బింబిసార’.. ఈమధ్య మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వినిపిస్తుందీ పేరు. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో.. భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. పాండమిక్ వంటి కారణాలతో ఆలస్యమవుతూ వస్తుంది.

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ట్స్ బ్యానర్ మీద బావ మరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. అయితే డైరెక్టర్ వశిష్ట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ట్రైలర్ చూశాక.. ‘ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్‌ మేకింగ్ ఏంటబ్బా.. ఎవరీ కుర్రాడు?’ అంటూ ఆరాతియ్యడం స్టార్ట్ చేశారు.

ఆగస్టు 5న ‘బింబిసార’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇప్పటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాత్రమే సినిమా చూశారని, తారక్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు అని చెప్పడంతో హైప్ మరింత ఎక్కువైంది. పైగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ ఫ్రాంఛైజీలో మరికొన్ని సినిమాలు వస్తాయి, తమ్ముడితో కలిసి కనిపించే అవకాశముంది అని చెప్పడం కూడా అసలు ఇంతకీ ఈ డైరెక్టర్ ఎవరు, బ్యాగ్రౌండ్ ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించాయి.

వశిష్ట్ రెడ్డి…
తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన నిర్మాతగా అల్లు అర్జున్-వి.వి.వినాయక్‌ల కాంబినేషన్‌లో మాస్ హిట్ ‘బన్నీ’ చేశారు. తర్వాత మాస్ మహారాజా రవితేజ- రసూల్ ఎల్లోర్ కలయికలో ‘భగీరథ’ మూవీ చేశారు..

నాన్న నిర్మాత కావడంతో వశిష్ట్‌కి చిన్నప్పటినుండి సినిమాలమీద ఇంట్రెస్ట్ ఉండేది. హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ – (నీకందివుంటది) అనే చిత్రం చేసాడు. దర్శకుడు తేజ సినిమాలతో పాపులర్ అయిన గేయ రచయిత కులశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

తర్వాత డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి.. స్టడీస్, ఆ తర్వాత ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తూ.. కథలు రాసుకోవడం స్టార్ట్ చేసాడు వశిష్ట్.. అలా ఫస్ట్ ప్రాజెక్ట్‌గా ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ అని టాక్ రావడంతో పాటు ఆ ఫ్రాంఛైజీలో కొన్ని సినిమాలు రాబోతున్నాయి. పైగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమా కోసం వశిష్ట్‌కి అడ్వాన్స్ ఇచ్చారని ఫిలిం నగర్ టాక్. ఇది నిజమే అన్నట్టు ఈమధ్య ఓ ఇంటర్వూలో తాను చిన్నప్పటినుండి బాలయ్య బాబు ఫ్యాన్ అని చెప్పాడు వశిష్ట్. మొత్తానికి ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు.. అటు నందమూరి అభిమానుల్లోనూ మంచి హాట్ టాపిక్‌గా మారాడు వశిష్ట్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...