Home Film News Comedian Sudhakar: ఎంతో అందంగా ఉండే క‌మెడీయ‌న్ సుధాక‌ర్ ఇలా అయిపోయారేంటి..!
Film News

Comedian Sudhakar: ఎంతో అందంగా ఉండే క‌మెడీయ‌న్ సుధాక‌ర్ ఇలా అయిపోయారేంటి..!

Comedian Sudhakar: ఒక‌ప్పుడు త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన వారిలో సుధాక‌ర్ కూడా ఒక‌రు. అప‌ట్లో కొంద‌రు సినీ ప్రేక్ష‌కులు అయితే సుధాక‌ర్ కోస‌మే థియేట‌ర్స్ కి వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. అంత‌లా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు.  సుధాక‌ర్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి సినిమాలు చేశారు. అయితే కొంతకాలంగా సుధాక‌ర్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నారు. ఇంటిప‌ట్టునే ఉంటూ ప్ర‌త్యేక వైద్యం తీసుకుంటున్నారు. అయితే సుధాక‌ర్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు.

కొన్ని మీడియా సంస్థలు సుధాక‌ర్ చ‌నిపోయాడంటూ  దుష్ప్రచారం చేయడంతో.. ‘నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు’ అంటూ సుధాకర్ వీడియో విడుదల చేసి తన క్షేమ సమాచారాన్ని అభిమానుల‌కి  అందించారు. సుధాక‌ర్అ ప్పుడప్పుడు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తుంటారు. అయితే అది చూసిన కొంద‌రు అత‌ని ఆరోగ్య పరిస్థితి క్షీణించింద‌ని, కోమాలోకి వెళ్లిపోయారని, కొందరైతే ఆయన చనిపోయారంటూ పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియాలో వ‌చ్చే లైక్స్ కోసమో అదనపు సంపాదన కోసం  బ్ర‌తికి ఉన్న వారి ఆరోగ్యం గురించి ఇలాంటి నీచమైన పుకార్లు పుట్టించడం చాలా హేయమైన  చ‌ర్య అని అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నేడు ఫాదర్స్ డే (జూన్ 18) సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌ ‘నేను నాన్న’ అనే స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించారు. ఎంతో సందడిగా సాగిన ఈవెంట్‌లో సీనియర్ నటుడు సుధాకర్ కనిపించి తన నవ్వుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. తన ఫేమస్ డైలాగ్ అయిన ‘అబ్బబ్బబ్బా’ అంటూ చెప్పి ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశారు. తనలో ఓపిక లేకపోయినా సుధాకర్ అబ్బబ్బబ్బా అంటూ చెప్పడం చూస్తే ఆయన కళని ఎంత అభిమానిస్తారనేది అర్ద‌మైంది. ఆయన అలా డైలాగ్  చెప్తుంటే.. అంద‌రి  కళ్లు చెమ్మగిల్లాయి. సుధాకర్‌ని ఇలా చూసి ఆయన అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు.  కాగా, సుధాకర్ పవిత్ర ప్రేమ, చక్రవర్తి, యుముడికి మొగుడు, రాజా, ఒంటరి పోరాటం, స్టేట్ రౌడీ, కొదమ సింహం, మజ్ను, రాజా విక్రమార్క, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు, పెళ్లిపందిరి, పెళ్లి చేసుకుందాం,సుస్వాగతం.. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాల్లో నటించారు

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...