Home Film News JD Chakravarthy: యాంక‌ర్ విష్ణు ప్రియ‌తో పెళ్లిపై స్పందించిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి..!
Film News

JD Chakravarthy: యాంక‌ర్ విష్ణు ప్రియ‌తో పెళ్లిపై స్పందించిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి..!

JD Chakravarthy: గుబురు గ‌డ్డంతో చాలా స్టైలిష్‌గా క‌నిపించే జేడీ చ‌క్ర‌వ‌ర్తి అంటే ఇప్ప‌టి వారికి అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు. అప్ప‌టి వారు మాత్రం జేడీని చాలా ఇష్ట‌ప‌డేవారు. అంతేకాదు ఆయ‌న స్టైల్‌ని, లుక్‌ని అనుక‌రించేవారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయెరా, గులాబి, కోదండరాముడు, మనీ వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో నటుడిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. కేవ‌లం న‌టుడిగానే కాకుండా ఆయ‌న ద‌ర్శ‌కుడిగా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లోను అద‌ర‌గొట్టాడు. ప్ర‌స్తుతం ప‌లు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ అల‌రిస్తున్నాడు జేడి. అయితే ఆయ‌న న‌టించిన వెబ్ సిరీస్‌లో యాంక‌ర్ విష్ణు ప్రియ న‌టించింది.

ఆ స‌మ‌యంలో జేడీ చక్ర‌వ‌ర్తిపై మనసు పారేసుకున్న విష్ణు ప్రియ‌ రీసెంట్ గా ఓ షోలో మాట్లాడుతూ చక్రవర్తి అంటే చాలా ఇష్టం అని, అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని పేర్కొంది. అంతేకాదు జేడీ చక్ర‌వ‌ర్తిని పెళ్లి చేసుకోవ‌డాని వాళ్ల అమ్మ‌ని కూడా క‌న్విన్స్ చేస్తాన‌ని పేర్కొంది. ఆమె వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. దీనిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా కామెంట్ చేశారు. అయితే విష్ణు ప్రియ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి. కొద్ది రోజుల క్రితం నేను, విష్ణుప్రియ కలిసి ఓ సిరీస్ లో నటించ‌గా, అది త్వరలోనే రిలీజ్ అవుతుంది.

 

అయితే ఆ వెబ్ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాము. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది చెప్పిన జేడీ అది ప్రేమ కాదు అని తెలియ‌జేశాడు. ఇక ఆ సిరీస్ డైరెక్టర్ నాతో విష్ణుప్రియ చాలా బాగా నటించాలని తనని నా సినిమాలను చూడమని చెప్పాడు.అప్పుడు ఆమె నా క్యారెక్టర్స్ తో ప్రేమలో పడింది. అంతే తప్ప అది మీరనుకునే ప్రేమ కాదు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియ‌-జేడీకి సంబంధించి ఇన్నాళ్లు వ‌స్తున్న వార్త‌ల‌కి చెక్ ప‌డింది. ఈ యాంక‌ర‌మ్మ హీరో అఖిల్ అంటే కూడా చాలా ఇష్ట‌మని ప‌లు సంద‌ర్భాల‌లో తెలియ‌జేసింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...